News
News
వీడియోలు ఆటలు
X

BJP MLA Rajasingh: బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్ - ఎందుకంటే

హైదరాబాదులోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ లోధా ఏక సంఘ ప్రతినిధులైన ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి లకు లోధా/లోది ఆత్మగౌరభవనానికి సంబంధించిన అనుమతి పత్రాలను అందజేశారు. 

FOLLOW US: 
Share:

- తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూముల్లో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం
- లోధా/లోది సామాజిక వర్గంలోని మూడు సంఘాలు కలిసి ఏక సంఘంగా ఏర్పాటు 
- ఏక సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరీలకు ఆత్మగౌరవ భవన నిర్మాణ పత్రాలు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్
- ప్రభుత్వానికి, కేసీఆర్ కి, మంత్రి గంగులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్, లోదా కుల సంఘం
- అన్ని మౌలిక వసతుల కల్పనతో శరవేగంగా బిసి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం
- 41 కుల సంఘాలకు 87.3 ఎకరాలు 95 వేల కోట్లు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడు సంఘాలుగా ఉన్న లోదా సామాజిక వర్గం 'లోద్ క్షత్రియ సర్దార్ పంచాయత్' పేరుతో ఏక సంఘంగా ఏర్పడింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని తన నివాసంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు బుధవారం లోధా ఏక సంఘ ప్రతినిధులైన ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి లకు లోధా/లోది ఆత్మగౌరభవనానికి సంబంధించిన అనుమతి పత్రాలను అందజేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో మంత్రి గంగుల విశేష కృషితో రాష్ట్రంలో బీసీ సంఘాలు ఏకతాటిపైకి వస్తున్న విషయం విదితమే. గతంలో 27 కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూముల్లో ఆత్మగౌరభవనాలను నిర్మించుకుంటున్నాయి. నేడు ప్రభుత్వ కృషితో లోది సామాజిక వర్గం లోని అన్ని సంఘాలు ఏకతాటి పైకి వచ్చాయి ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి ఇతర లోది సామాజిక వర్గ నేతలంతా ఏకసంఘంగా ముందుకు వచ్చి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి గంగుల. ఉప్పల్ బాగాయత్లో లోదా/లోది సామాజిక వర్గ ఆత్మగౌరవ భవనానికి 20 గుంటల తో పాటు 50 లక్షలు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా లోధా సంఘం ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజాసింగ్ లోదా సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనం కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి గంగుల కమలాకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అతి త్వరలోనే భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తామని మంత్రితో పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం బీసీలు ఆత్మగౌరవంతో జీవించేలా ఆయా కులాల ఘన వారసత్వం ప్రతిఫలించేలా 41 కుల సంఘాలకు కోకాపేట్, ఉప్పల్ భగాయత్లోని వేల కోట్ల విలువచేసే 87.3 ఎకరాలు, 95.25 కోట్లను కేటాయించి నిర్మాణాలు సైతం వారి ఘణ వారసత్వం ప్రతిబింబించేలా జరుపుకునేలా వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ప్రతి కులంలో ఏక సంఘంగా ఏర్పడిన కుల సంఘాలకు నిర్మాణ బాధ్యతలు అప్ప చెప్పడమే కాకుండా మిగతా సంఘాలకు సైతం ప్రభుత్వమే అన్ని వసతులతో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మిస్తోంది.
కోకాపేట్, ఉప్పల్ భగాయత్లో పలుమార్లు పర్యటించిన మంత్రి గంగుల మౌలిక వసతుల ఏర్పాట్లను సైతం దగ్గరుండి పర్యవేక్షించారు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వంటి సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి లోధా సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు.

Published at : 26 Apr 2023 09:45 PM (IST) Tags: Hyderabad Gangula kamalakar Raja Singh BRS KCR

సంబంధిత కథనాలు

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

టాప్ స్టోరీస్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?