By: ABP Desam | Updated at : 28 Jul 2022 03:15 PM (IST)
భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)
Bhatti Vikramarka On MLA Rajagopal Reddy Issue: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు స్పందించారు. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైనా మనస్తాపానికి గురయి ఉంటే తనతో అన్ని విషయాలు మాట్లాడతామని అన్నారు. ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించేందుకు ఇష్టం లేదని, సాధ్యమైనంత వరకు పార్టీలోనే ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని భవిష్యత్తులో కూడా ఆయన సేవల్నలి తాము వినియోగించుకోవాలనే చూస్తున్నట్లుగా వెల్లడించారు.
బండి సంజయ్ ఉన్మాది..
తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ఉన్మాది అంటూ అభివర్ణించారు. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందని తాను అనుకోవట్లేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టి సమయాన్ని వృథా చేసుకోదని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపైనే తమ దృష్టి అని అన్నారు.
అంతేకాకుండా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అన్నా, సోనియా, రాహుల్ గాంధీ అన్నా బాగా గౌరవం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే తాను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో దాదాపు 3 గంటలపాటు మాట్లాడానని అన్నారు. ఇప్పటికీ ఆయనకు ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే తామే మాట్లాడతామని, పార్టీలోనే కొనసాగేలా చేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టి వివరించారు.
పార్టీ సీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడారని అన్నారు. వారికి ఆయన వివరణ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. కోమటిరెడ్డి అమిత్ షాను కలిసిన అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు పార్లమెంటు సెషన్ సమయంలోనూ, మరోచోట ఇతర పార్టీల వారిని సాధారణంగా కలుస్తుంటారని, అంత మాత్రాన దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని అన్నారు.
Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75
Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్
MLC Mahender Reddy: టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసమే పని చేస్తా: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?