News
News
X

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ రెడీ, తెలంగాణ సర్కారుకు బండి సంజయ్ లేఖాస్త్రం

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వమని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సర్కారుకు లేఖ రాశారు. మొత్తం 30 మంది సందర్శనకు వెళ్లాలనుకుంటున్నట్లు వివరించారు. 

FOLLOW US: 

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వెళ్లాలనుకుంటున్న బీజేపీ నేతల బృందానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ నిపుణులు కలిసి మొత్త 30 మంది వరకు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలనుకుంటున్నట్లు వివరించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు బీజేపీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గల కారణాలను గురించి సమాచారం తెలుసుకునేందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. అలాగే తమకు ప్రాజెక్టు నిర్మాణంపై చాలా అనుమానాలు ఉన్నాయని వాటన్నిటిని నివృతి చేసుకోవడానికే బీజేపీ బృందం వెళ్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వరదల వల్ల ప్రాజెక్టులో మోటార్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించడమే బీజేపీ బృందం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

1998 వ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయమని... 2004-2009 మధ్య జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ సర్కారు తమ బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున కూడా ఇరిగేషన్ అధికారులను పంపి మా సందేహాలను నివృత్తి చేయాలన్నారు. 

వరంగల్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. 
సీఎం కేసీఆర్ కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా బీజేపీ కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు బీజేపీ సిద్ధాంతం అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు బండి సంజయ్.  

"దిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు నన్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ ఒక్కటే కాదు తెలంగాణలో ఈడీ అధికారులు ఏ కంపెనీపై దాడులు చేసినా అందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందో లేదో తెలపాలి. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల లెక్కలు బయటకు తీస్తున్నాం. హిందూ దేవతలపై వ్యంగ్యంగా మాట్లాడిన కమెడియన్ కు 2000 వేల మంది పోలీసుల భద్రత మధ్య షో పెట్టుకోవచ్చు. లిక్కర్ స్కామ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై చర్చ జరగకూడదని మునావర్ షరూఖీని తీసుకొచ్చి ఇక్కడ షో పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ షో పెట్టి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయలబ్ది పొందాలని చూశారు.

పేదల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించడానికి పాదయాత్ర చేస్తే అనుమతి లేదు. అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే బీజేపీని బూచి చూపించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ టైంలో అధికారంలోకి రావడానికి మత ఘర్షణలు లేవనెత్తారు. సీఎం కేసీఆర్ తన పదవి కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే మతవిద్వేషాలు రెచ్చిగొట్టి బీజేపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   

Published at : 28 Aug 2022 04:45 PM (IST) Tags: Bandi Sanjay Bandi sanjay latest news Bandi Sanjay Comments on TRS Bandi Sanjay Wrote A Letter to Telangana Govt Bandi Sanjay Fires on Telangana CM KCR

సంబంధిత కథనాలు

KTR : మెడికల్ కాలేజీల అంశంలో కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR : మెడికల్ కాలేజీల అంశంలో కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

YS Sharmila :తెలంగాణకు ఏంచేయలేని కేసీఆర్ దేశంపై పడతారట, వైఎస్ షర్మిల సెటైర్లు

YS Sharmila :తెలంగాణకు ఏంచేయలేని కేసీఆర్ దేశంపై పడతారట, వైఎస్ షర్మిల సెటైర్లు

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!