News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bandi Sanjay: 10 లక్షల మందితో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ, బండి సంజయ్ వెల్లడి - డేట్ ఫిక్స్

Telangana BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బండి సంజయ్‌ సోమవారం పరిశీలించారు.

FOLLOW US: 
Share:

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆ సమావేశాల కోసం 35 కమిటీలు వేశామని, వారందరికీ బాధ్యతలు అప్పగించామని వివరించారు.. వారి ఆధ్వర్యంలో సమావేశాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని అన్నారు. ఈ సమావేశాల్లో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు మరో 300 మంది పార్టీ నేతలు పాల్గొంటున్నారని అన్నారు.

కరోనా అనంతరం మొదటిసారిగా ప్రత్యక్షంగా హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా పాల్గొంటారని వివరించారు. అతి పెద్ద సమావేశాలు ఇక్కడ సమావేశాలు నిర్వహించడం కార్యకర్తలకు పెద్ద భరోసానిస్తుందని అన్నారు.

జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు 10 లక్షల మందితో ప్రధాని మోదీ సభ ఉంటుందని వివరించారు. 34 వేల పోలింగ్ బూత్ ల నుంచి జన సమీకరణ చేస్తామని చెప్పారు. 50 వేల మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ‘‘క్యాష్ రూపంలో ఎక్కడా బీజేపీ నిధి సేకరణ ఉండదు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే నిధుల సేకరణ ఉంటుంది’’ అని బండి సంజయ్ వివరించారు.

ఈటల రాజేందర్, అమిత్ షా భేటీపై బండి సంజయ్ స్పందిస్తూ, వారిద్దరూ కలిస్తే తప్పేంటని వ్యాఖ్యానించారు. ఆ భేటీ విషయంలో వేరే అర్థాలు తీయవద్దని అన్నారు.

నోవాటెల్ హోటల్ వద్ద వేదిక పరిశీలన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బండి సంజయ్‌ సోమవారం పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్‌ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుత పదవి కాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి. సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఆయన నేతలతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

Published at : 20 Jun 2022 02:22 PM (IST) Tags: PM Modi Telangana BJP news Bandi Sanjay novotel hyderabad bjp national executive meeting Bandi sanjay in novotel

ఇవి కూడా చూడండి

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

టాప్ స్టోరీస్

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ  నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్