News
News
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు: అరబిందో ఫార్మా డైరెక్టర్, మరో కీలక వ్యక్తి అరెస్టు

అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాలు ప్రకటించాయి.

FOLLOW US: 
 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగవంతం అయింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఇద్దరు పెద్ద వ్యాపారులను తాజాగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాలు ప్రకటించాయి. శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి  డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ ఆర్టికల్ ఇంకా అప్ డేట్ అవుతుంది)

Published at : 10 Nov 2022 08:35 AM (IST) Tags: Enforcement directorate Delhi Liquor Scam aurobindo pharma P Sarath Chandra Reddy Vinay babu

సంబంధిత కథనాలు

Palla Rajeshwar Reddy :  సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

Bhadradri Kothagudem Politics : ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా చర్చ!

Bhadradri Kothagudem Politics : ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా చర్చ!

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!