KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
తెలంగాణలో అశీర్వాద్ పైప్స్ తన యూనిట్‌ను ప్రారంభించనుంది. ఐదు వందల కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయనుంది.
రెండో రోజు దావోస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. తాజాగా ఆశీర్వాద్ పైప్స్ (aliaxis) గ్రూప్ తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనునట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది.
అలియాక్సిస్ కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. కేవలం దేశీయ మార్కెట్ల కోసమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్టు వివరించారు. తెలంగాణ నుంచి ఇతర దేశాలతకు అవసరమయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులను రెడీ చేసే లక్ష్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Another major investment for Telangana from Davos!@AshirvadPipe of @WeAreAliaxis will be setting up a Greenfield Facility with an investment of Rs. 500 Crore in Telangana. This investment will create over 500 jobs for youngsters in our state.#TelanganaAtDavos#InvestTelangana pic.twitter.com/cXD1pDbGvL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2022
తెలంగాణలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆశీర్వాద్ పైప్స్‌కు మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కంపెనీ ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడి ద్వారా ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేస్తున్న తయారీ ప్లాంట్ కోసం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
The firm will manufacture Storage & Distribution of Plastic Piles, Fittings & Accessories. The announcement came after @WeAreAliaxis CFO Mr. Koen Sticker met with Minister @KTRTRS on the sidelines of @wef in Davos.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2022
హైదరాబాద్‌లోని తమ కార్యాలయం తన రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నోవార్టిస్ కంపెనీ విస్తరణ ప్రణాళికలుపైన చర్చించారు. ఇప్పటికే తమ కంపెనీ అనేక దేశాల్లో తయారీ యూనిట్లతోపాటు, ఇతర పరిశోధన కేంద్రాలను కలిగి ఉందని తెలిపిన వాస్ నరసింహన్, హైదరాబాద్ తమ కార్యాలయం ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధి సాధించిందని తెలిపారు.
భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీలకెల్లా తన నోవార్టిస్ క్యాపబిలిటీ సెంటర్ అతి పెద్దది అని తెలిపారు వాస్ నరసింహన్. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9000 మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం తన రెండో అతి పెద్ద కార్యాలయంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఏషియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు.
నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. నోవార్టిస్ తన కేంద్ర కార్యాలయానికి అవతల అతిపెద్ద ఆఫీస్‌గా హైదరాబాద్ మారడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో నోవార్టిస్ విస్తరణ వలన తెలంగాణ లైఫ్ సైన్స్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. నోవార్టిస్ వలన ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్రశ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం ప్రతిష్ట నోవార్టిస్ మరింత వృద్ధి చేసిందని అభిప్రాయపడ్డారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో భారీగా విస్తరించిన నోవార్టిస్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.