News
News
X

Telangana Textile:తెలంగాణ చేనేత కళావైభవం అద్భుతం- కేటీఆర్‌తో భేటీలో అమెరికన్ రీసెర్చ్ స్కాలర్ ప్రశంసలు

తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు. దీర్ఘకాలం పాటు తాను కొనసాగిస్తున్న చేనేతల అధ్యయనంలో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో కొనసాగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి మరియు అక్కడి స్థితిగతులపైన ఆమె క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు టెక్స్ టైల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana Minister KTR)ని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాను పర్యటించిన ప్రాంతాల్లో గుర్తించిన అనేక ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. నేతన్నలకు ముఖ్యంగా చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలతో పాటు వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరాకు కేటీఆర్ వివరించారు.

చేనేతల అధ్యయనానికి తెలంగాణనే మొదటి గమ్యస్థానం
మంత్రి కేటీఆర్ తో భేటీ సందర్భంగా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ పరిశోధకురాలు కైరా కొన్ని ముఖ్య అంశాలను తెలిపారు. తన పరిశోధనలో భాగంగా ఇప్పటిదాకా 9 దేశాలలో పర్యటించానన్న కైరా భారతదేశంలో చేనేతల అధ్యయనానికి తెలంగాణనే మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కళాకారులు తమ ఉత్పత్తులు తమ కళపట్ల అత్యంత గర్వంగా ఉన్నారని ముఖ్యంగా తాము చేసే పని పట్ల వారి నిబద్దత చాలా గొప్పగా ఉందని ఆమె ప్రశంసించారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. 
ఇతర దేశాలకు భిన్నంగా ఒకే చోట వందలాదిమంది చేనేత కార్మికులు కలిసి పనిచేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్టు తాను గుర్తించానన్నారు. తమ ఉత్పత్తులకు బ్రాండ్ ని క్రియేట్ చేయడంతో పాటు మార్కెట్ విస్తృతికి ఈ అంశం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రోత్సాహకాల పట్ల ఇక్కడి కార్మికులకు ఉన్న అవగాహన ఆశ్చర్యానికి గురిచేసిందన్న కైరా,  ప్రభుత్వం తమకు ఏం చేస్తోంది? ఎలాంటి పథకాలు అమలవుతున్నాయన్న అంశాల మీద ప్రతీ కార్మికుడికి పూర్తి సమాచారం, స్పష్టత ఉందన్నారు. 9 దేశాల్లో చూడనంత గొప్ప కళా నైపుణ్యం ఇక్కడి చేనేత వస్త్రాల్లో ఉందని కైరా అబ్బురపడ్డారు. 

ఇక్కడి చేనేతల్లో ఉన్న కళా నైపుణ్యం ఎంతో విలువైనదన్న కైరా, ప్రపంచ మార్కెట్లలో దీనికి అద్భుతమైన డిమాండ్ ఉందన్నారు. భారతదేశంలో చేనేతల ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని అయితే, దుస్తులు, ఇతర ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమలను అనుసంధానం చేస్తే మంచి మార్కెట్ ఏర్పడుతుందని కైరా సూచించారు. ఇక్కడి పవర్లూమ్ కార్మికులు సైతం డబుల్ జకార్డ్ వంటి వినూత్నమైన టెక్నిక్ లతో దుస్తులను నేయడం బాగుందన్నారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ లను హ్యాండ్లూమ్ రంగానికి  అందుసంధానిస్తే భవిష్యత్తు తరాలకి చేనేత కళ సమున్నతంగా అందుతుందన్న విశ్వాసం తనకున్నదని కైరా తెలిపారు. 

చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన కైరా లాంటి పరిశోధకుల పక్షపాతం లేని అభిప్రాయాలు ఎంతో విలువైనయన్న కేటీఆర్, పరిశ్రమ అభివృద్ధికి వారి నుంచి విలువైన సూచనలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు ఇతర దేశాల్లో చేనేత వస్త్ర పరిశ్రమ ఉన్నతికి అమలవుతున్న కార్యక్రమాల గురించి వారి నుంచి సమాచారం తెలుసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే నేతన్నల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని అందులో భాగంగానే ఆత్మహత్యల సంక్షోభం నుంచి ఈరోజు నేతనుల పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు. 
కైరా లాంటి విస్తృత అధ్యయనం చేసిన నిపుణులు, సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఇతర రాష్ట్రాల టెక్స్ టైల్ శాఖలతో సమన్వయం చేసే విషయంలో కైరాకు సహాయం చేయాలని తెలంగాణ టెక్స్ టైల్, చేనేత అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Published at : 07 Dec 2022 08:51 PM (IST) Tags: KTR Telangana Telangana Textile Sector Telangana Handloom Workers American Handloom Research Scholar

సంబంధిత కథనాలు

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !

GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!

Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం