CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్
రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఎయిర్ పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ మెట్రోను ఎయిర్ పోర్టు వరకూ విస్తరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మించుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకపోయినా సరే మెట్రోను విస్తరిస్తామని అన్నారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ వైశాల్యం కంటే పెద్దదని అన్నారు. 1912లో హైదరాబాద్‌కు కరెంటు వస్తే, మద్రాసు నగరానికి 1927లో విద్యుత్ వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఎయిర్ పోర్టు వరకూ మెట్రోను విస్తరించడం గొప్ప విషయమని కేసీఆర్ కొనియాడారు. అప్పా జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఎయిర్ పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
‘‘దేశంలో ఎక్కడా లేని సమశోతోష్ణస్థితి ఉండే వాతావరణం ఉండేది హైదరాబాద్ నగరం. భూకంపాల భయం లేని నగరం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది స్థిరపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గతంలో కరెంటు లేక పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసిన ఘటనలు మనం చూశాం. గతంలో ఎన్నో చోట్ల తాగునీటి సమస్యలు కూడా ఉండేవి. తెలంగాణ సాధించుకున్నాక అన్ని సమస్యలు పరిష్కరించుకొని విశ్వనగరంగా మార్చాం’’ అని కేసీఆర్ అన్నారు.
ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు
భవిష్యత్‌లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకపోయినా సరే మెట్రోను విస్తరిస్తామని అన్నారు. ‘‘భూకంపాలు రాకుండా, భూగోళం మీదనే సేఫేస్ట్‌గా ఉండే నగరం హైదరాబాద్. అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన ఉన్నవారు ఉన్నారు. గుల్జార్ హౌస్ వద్ద 300 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలు ఉన్నారు. ఈ కల్చర్ మన సొంతం. గతంలో సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించాం. మాకు కరెంట్ ఇవ్వండి, సరిపోవడం లేదని వర్కర్స్ బాధపడ్డారు. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతాం అని పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేశారు. హైదరాబాద్‌లో ఏ బస్తీకి వెళ్లినా చాలా భయంకరమైన మంచినీటి బాధలు ఉండే చూశాం. అవన్నీ క్లియరెన్స్‌లు సాధించి మంచి నీటి వసతి ఏర్పాటు చేసుకున్నాం’’ అని కేసీఆర్ అన్నారు.