72nd Miss World Winner : మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత
72nd Miss World Winner : హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్‌న 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

Background
72nd Miss World Grand Finale: ఇప్పుడు ప్రపంచం చూపు అంతా హైదరాబాద్ పైనే ఉంది. 72 వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికైంది. నెలరోజులకు పైగా తెలంగాణలో జరుగుతున్న ఆ ప్రపంచం సంరంభం ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. తెలంగాణ జరూర్ ఆనా Telanagana Jaroor Aana అంటూ ఈసారి City of Pearls ఈ భారీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. హైదరాబాద్ హైటెక్స్‌లో ఫైనల్ సంబరం మొదలైంది…. మరి కొద్దిసేపట్లోనే ప్రపంచ సుందరి ఎవరో తేలిపోనుంది
72nd Miss World Runner: మిస్ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా ఇథియోపియా భామ
72nd Miss World Runner: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె నిలిచారు.
పూర్తి పేరు- హాసెట్ డెరెజె
దేశం- ఇథియోపియా
వృత్తి- మోడలింగ్
వయస్సు- 19 సంవత్సరాలు
విద్య- అడిస్ అబాబా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శఇటీలో కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం
ఎత్తు- 178 సెంటీ మీటర్లు
భాషలు- అమ్హారిక్, ఇంగ్లీష్
ప్రత్యేకత- మిస్ వరల్డ్ ఇథియోపియా 2024 విజేత. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ అంబాసిజర్
72nd Miss World Winner : మిస్ వరల్డ్ 2025గా ఎంపికైన థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత
72nd Miss World Winner : మిస్ వరల్డ్ 2025గా ఎంపికైన థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత ప్రొఫైల్ చాలా భిన్నమైంది.
పూర్తి పేరు- ఓపల్ సుచాతా చుయాంగ్స్రీ
దేశం -థాయ్‌లాండ్, పుకెట్
పుట్టిన తేదీ- 20 సెప్టెంబ్ 2003
విద్యావివరాలు-
ప్రాథమిక, ప్రీ- యూనివర్శిటీ విద్యను ఫుకెట్‌లోని కజొంకియేసుక్సా స్కూల్‌లో, బాంకాక్‌లోని ట్రైమ్ ఉదోం సుక్సా స్కూల్‌లో పూర్తి చేశారు.
ప్రస్తుతం థామ్మసాట్ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్రం అండ్ అంతర్జాతీయ సంబంధాలపై డిగ్రీ చదువుతున్నారు.
కుటుంబం-
తండ్రి- థనెట్ డోంకామ్‌నెర్డ్
తల్లి- సుపత్రా చుయాంగ్స్రీ
పుకెట్‌లోని ప్రైవేట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.





















