News
News
X

YS Sharmila : తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు - వైఎస్ షర్మిల

YS Sharmila : లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

YS Sharmila : ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో  హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ 

రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని, బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి చేస్తున్న యజ్ఞం అన్నారు. మేం అడుగడుగునా శాంతియుతంగా పాదయాత్ర చేశామన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించలేదన్నారు. 3500 కి.మీ. దాటిన తర్వాత టీఆర్ఎస్ గూండాలే తమపై దాడి చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్టీపీ వల్ల కేసీఆర్ పాలనకు ప్రమాదం అని తెలిసి పాదయాత్రను ఆపడానికి కుట్ర పన్నారని విమర్శించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేశారని, పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. 

ప్రశ్నిస్తే దాడులా 

"పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వడం లేదు. కేసీఆర్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తున్నారు. మేం పాదయాత్ర చేస్తే కేసీఆర్ కు వచ్చిన నష్టమేంటి? వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ కు భయం లేకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి? అడుగడుగునా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. ఒకేసారి పాదయాత్ర ఆపాలన్న కుట్ర ఎందుకు చేస్తున్నారు? మీరు హామీ ఇచ్చిన రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు,  మైనార్టీల 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదు. అవి మేం ప్రశ్నిస్తే మాపై దాడులా? ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? భారతదేశంలో ఒక రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. నర్సంపేట్ లో టీఆర్ఎస్ నేతలు మా బస్సు తగలబెట్టి, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెడితే , ఫ్లెక్సీలు నాశనం చేస్తే, పెట్రోల్ దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేసి మమ్మల్ని, మా వాళ్లను గాయపరిచినా వారిపై ఎలాంటి చర్యలు లేవు. బాధితులు మేమైతే, మమ్మల్నే అరెస్ట్ చేశారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి" - వైఎస్ షర్మిల 

మరదలు అని హేళన చేసిన మౌనంగానే ఉన్నాం
 
వ్యక్తిగతంగా ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎవరిని కించపరచలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించామన్నారు.  చాలారోజులు పాదయాత్ర సజావుగా సాగిందని, తమ పార్టీ నాయకులపై దాడులు చేసిన సంయమనం పాటించారన్నారు. కేసీఆర్ పని గట్టుకుని తమ పాదయాత్రపై కుట్ర చేశారని ఆరోపించారు. పోలీసులను జీతగాళ్లలా, టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకొని తమను అరెస్ట్ చేయించారన్నారు. బెయిల్ పై బయటకు రాకుండా రిమాండ్ లో పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారని ఆక్షేపించారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ను ప్రశ్నించకపోవడం వల్లే ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందన్నారు. వైఎస్సార్టీపీ స్థాపించాక ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నామన్నారు.  మమ్మల్ని శిఖండి అని తిట్టినా, మరదలు అని హేళన చేసినా, వ్రతాలు అని కించపరిచినా, తొక్కుతాం అని హెచ్చరించినా మౌనంతో ఉన్నామన్నారు. టీఆర్ఎస్ నేతలే వ్యక్తిగత దూషణలకు పాల్పడి, మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే.. అవి రెచ్చగొట్టే వ్యాఖ్యాలు అవుతాయా అని ప్రశ్నించారు. ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవమన్నారు.  

Published at : 09 Dec 2022 03:37 PM (IST) Tags: YS Sharmila Hyderabad Padayatra CM KCR YSRTP

సంబంధిత కథనాలు

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!

Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

CM KCR Nanded Tour: నాందేడ్ లో ఆదివారం బీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్‌ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇలా

CM KCR Nanded Tour: నాందేడ్ లో ఆదివారం బీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్‌ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇలా

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

టాప్ స్టోరీస్

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ