అన్వేషించండి

Mla Raja Singh : అజ్మీర్ దర్గాపై వివాదాస్పద కామెంట్స్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులు

Mla Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు.

Mla Raja Singh : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు.  41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్‌ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసును కంచన్‌బాగ్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు బదిలీచేశారు. దీంతో మంగళ్‌హాట్‌ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

Mla Raja Singh : అజ్మీర్ దర్గాపై వివాదాస్పద కామెంట్స్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులు

వివాదాస్పద వీడియో

హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని రాజాసింగ్ పోరాటం చేశారు. ఆయన  హిందువుల్ని కించ పరిచారని ఆరోపించారు. అయితే షో యధావిధిగా నడిచింది.  దానికి కౌంటర్‌గా రాజాసింగ్.. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమయింది. పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు రిమాండ్‌కు పంపకుండానే బెయిల్ ఇచ్చింది. తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. గత ఏడాది  ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆయను జైలు తరలించారు.   పీడీ యాక్ట్‌పై తన భర్తను అక్రమంగా జైల్లో నిర్బంధించారని రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై పీడీ  యాక్ట్‌ను క్వాష్ చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే  పలు రకాల షరతులను విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.   

ఆగస్టులో కేసు 

అజ్మీర్‌ దర్గాపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ పై గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. అయితే ఈ అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. అంతకు ముందు మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్ట్‌ చేశారు. అనంతరం జైలుకు పంపించిన విషయం తెలిసిందే.  రాజాసింగ్ కు కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. 

బీజేపీ నోటీసులకు గతంలో వివరణ 

 మునావర్ ఫారుఖీని ఇమిటేట్ మాత్రమే చేశానని.. ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో రాజాసింగ్ వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని.. తనపై వందకు పైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 5 వందల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని.. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ డిసిప్లినరీ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలన్న విధంగానే తాను పోరాడుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపైన వంద కేసులు పెట్టారన్నారు. షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న విధంగా తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని .. క్రమిశిక్షణా చర్యలు తీసుకోవాల్సినంత తప్పు తానేమీ చేయలేదన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget