Minister KTR : మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి పౌరుడిపై రూ.1.25 లక్షల అప్పు, కేంద్రం అప్పులపై మంత్రి కేటీఆర్ ట్వీట్
Minister KTR : తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ప్రధాని అయ్యాక దేశం అప్పులు రూ.100 లక్షల కోట్లు దాటిందని విమర్శించారు.
Minister KTR : తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం చేసిన అప్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 ముందు 67ఏళ్ల స్వతంత్ర దేశంలో 14 మంది ప్రధానులు మారినా దేశం అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. కానీ బీజేపీ అధికారం చేపట్టిన గత ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. ఆర్థిక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పులపై మాట్లాడాలన్నారు. 2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయితే జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ కేవలం 23.5 శాతంగా ఉందన్నారు. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో ఐదు శాతం వాటా కలిగి ఉందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ కన్న మెరుగ్గా పనిచేస్తే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమికి ఎదిగేదని కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తున్న ప్రతీ రూపాయిలో కేవలం రూ.0.46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన డబ్బులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాల్లోని పీడీఎస్ షాపుల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అనే బోర్డులు పెడతారా? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు.
Madam FM waxes eloquent on Fiscal prudence;
— KTR (@KTRTRS) September 4, 2022
Till 2014, in 67 years 14 Prime Ministers of India together have raised a debt of ₹ 56 Lakh Crores
Then came PM Modi Ji; in the last 8 years alone India’s debt incremented by ₹ 100 Lakh Crores
Every Indian has a debt of ₹1.25 Lakh
Since our FM is going around lecturing on how “Modi Sarkar” is the Giver
— KTR (@KTRTRS) September 3, 2022
Here are the facts & figures👇
For every Rupee that Telangana contributes to the Nation, we only get back 46 paisa!
Madam, time to put up a banner:
“Thanks to Telangana” in all BJP states’ at PDS shops pic.twitter.com/LiJFzINvOI
నిర్మలా సీతారామన్ కామెంట్స్
తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర అప్పులపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రతి పిల్లాడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వ్యయం కన్నా రూ.లక్ష 20 వేల కోట్లకు అదనంగా పెంచారన్నారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ అయిందన్నారు. బడ్జెట్ అప్రూవల్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి చెప్పడంలేదన్నారు. బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందన్నారు. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1 .25 లక్షల అప్పు ఉందని కేంద్ర మంత్రి సీతారామన్ ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎమ్ లిమిట్ ను తెలంగాణ దాటి పోతుందని ఆరోపించారు.
Also Read : Revanth Reddy: చదువు చెప్పమంటే చంపుతున్నారు, కేసీఆర్ కక్ష కట్టారు: రేవంత్ రెడ్డి