Minister KTR : హైదరాబాద్ లో విమాన ఇంజిన్ల నిర్వహణ సెంటర్, రూ. 1200 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ లో మరో విమానయాన సంస్థ ఇంజిన్ల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుకు చేసింది. శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూ. 1200 కోట్ల పెట్టుబడితో సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు సెంటర్ ఏర్పాటుచేసింది.
Minister KTR : హైదరాబాద్ లోని శంషాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్‌ను శంషాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎంఆర్ఓ కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రూ.1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రంతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభించనుంది.
వెయ్యి మందికి ఉపాధి
హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని ఆయన చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ.1200 కోట్లు అని వెల్లడించారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఈ సెంటర్ లో ఉపాధి లభిస్తుందన్నారు. శాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడంతో ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందన్నారు. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఆవిష్కరణల కోసం టీ హబ్ ప్లాట్‌ఫామ్ ను అందుబాటులో తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.1200 కోట్ల పెట్టుబడులు
విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ శాఫ్రాన్ భారత్‌లో తన తొలి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న శాఫ్రాన్ ఎమ్మార్వో కేంద్రంతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభించనుంది.