News
News
వీడియోలు ఆటలు
X

Mahindra Electric Vehicles: తెలంగాణలో రూ.1000 కోట్లతో మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

FOLLOW US: 
Share:

Mahindra Electric Vehicle Manufacturing Center In Telangana: మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది. 

ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా కంపెనీ తన లాస్ట్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా 3 & 4 వీలర్ వాహనాలను తయారుచేయునట్లు తెలిపింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. 
1000 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుతం జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను విస్తరించేందుకు ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులోనూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశం పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా
భారతదేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని, మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కంపెనీకి జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను మరింత విస్తరించడం ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ప్రకటించిన తాజా పెట్టుబడితో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

ఈ-వెహికిల్స్ హబ్ గా రాష్ట్రం మారనుందని, విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగం, పరిశధనల్లో దేశంలోనే తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అధునాతనస సాంకేతికతల అభివృద్ధి, వాడకంలో హైదరాబాద్ దూసుకోపోతుందని అన్నారు. మాదాపూర్ హైటెక్స్ లో బుధవారం రోజు ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈవీల ప్రోత్సహానికి తెలంగాణ కట్టుబడి ఉందని.. అవవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. కత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని వివరించారు.

Published at : 09 Feb 2023 08:46 PM (IST) Tags: KTR Mahindra Telangana Minister KTR E Vehicles Mahindra Mobility Electricle Vehicle Centre

సంబంధిత కథనాలు

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!