KA Paul : దేశంలో మోస్ట్ సెర్చేడ్ మ్యాన్ గా నా పేరు, అది నా రేంజ్ - కేఏ పాల్
KA Paul : సిరిసిల్ల తరహా ఘటన మళ్లీ రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేఏ పాల్ హెచ్చరించారు. ఇప్పటికే 19 వేల మంది ఎమ్మెల్యే టికెట్లు కావాలని తన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారన్నారు.
KA Paul : సిరిసిల్ల తరహా ఘటన భవిష్యత్తులో రిపీట్ అయితే ఖబడ్దార్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన... ఈ రోజు యావత్ ప్రపంచాన్ని క్షమాపణ అడుగుతున్నా అన్నారు. హైదరాబాద్ లో బాలికపై అత్యాచారం చేయడం సిగ్గుచేటు, దుర్మార్గులకి రాజకీయ అండదండలు ఉండటం సిగ్గుచేటు అన్నారు. ఈ ఘటనపై సీబీఐ అధికారులు, కేంద్ర హోం మంత్రి, మహిళా సంఘాల నాయకులు, పోలీస్ ఉన్నత అధికారులకు ఈ సమస్య గురుంచి తెలియజేశానన్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నానన్నారు.
నాకు బూతులురావు
కోట్లు ఖర్చు పెట్టి పేపర్ కి యాడ్స్ ఇవ్వడానికి సరిపోతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏ పేపర్ చూసిన కేసీఆర్, కేటీఆర్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. శ్రీకాంతచారి, తెలంగాణ కోసం అమరులైన ఒక్కరి ఫొటో కూడా కనపడలేదు. మోసగాళ్ల ఫొటో ఫ్రంట్ పేజీలో వేయడం సిగ్గుచేటు. యావత్ భారత్ దేశంలో మోస్ట్ సెర్చేడ్ మ్యాన్ గా నా పేరు ఉంది. అది నా రేంజ్. శ్రీకాంతచారి తండ్రిని చంపేస్తామని బెదిరిస్తునారు. శ్రీకాంతచారి తండ్రికి ఏమైనా జరిగితే కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత. మేము అమరుల కుటుంబాల నుంచి 20 మందిని అసంబ్లీకి పంపిస్తాం. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం -వచ్చిందే అమరవీరుల ప్రాణ త్యాగం వల్ల. అన్ని రాజకీయ పార్టీల లాగా నాకు బూతులు రావు. - కేఏ పాల్ , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో
ప్రతి రోజు తమ కార్యాలయం చుట్టూ ఎమ్మెల్యే సీట్ కోసం చాలా మంది తిరుగుతున్నారని కేఏ పాల్ అన్నారు. ఇప్పటి వరకు 19 వేల మంది ఎమ్మెల్యే సీట్ కోసం పోటీ పడుతున్నారన్నారు. హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ కేపిటల్ అన్నారు. ఇలా వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఇప్పటి వరకు కొంతమందిని మినహా మిగిలిన నిందితులని గుర్తించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మీడియాకి లైసెన్స్ ఇచ్చేది తామే అన్నారు. అప్పుడు ఇష్టం వచ్చినట్లు రాయడానికి అవకాశం లేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ తమ పార్టీ నాయకులతో నిండిపోతుందన్నారు. ఇప్పటికైనా మిగిలిన నాయకులకు ఛాన్స్ ఇస్తున్నానన్న ఆయన వచ్చి తన పార్టీలో జాయిన్ అవ్వాలని కోరారు. ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు తనతో టచ్ లో ఉన్నారన్నారు. ఎవరు ఎవరికీ భయపడకండన్న ఆయన తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానన్నారు.