News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad Metro : ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్, క్రికెట్ లవర్స్ కోసం అదనపు మెట్రో రైళ్లు!

Hyderabad Metro : ఐపీఎల్ మ్యాచ్ లకు భాగ్యనగరం రెడీ అయింది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. క్రికెట్ ప్రేక్షకుల కోసం మెట్రో అదనపు సర్వీసులు నడుపుతోంది.

FOLLOW US: 
Share:

Hyderabad Metro : ఐపీఎల్ మ్యాచ్ లకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో  సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే ఈ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆదివారం ఉప్పల్ లో జరిగి ఐపీఎల్ మ్యా్చ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు మెట్రో రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్-అమీర్ పేట మార్గంలో అదనపు రైళ్లు నడుపుతున్న మెట్రో అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అదనపు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.   

నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ లు

నాలుగేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత  భాగ్యనగారానికి మళ్లీ క్రికెట్ పండుగ వచ్చింది. 2019 తర్వాత  హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ  క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది.  నాలుగేండ్ల క్రితం వరకూ ఐపీఎల్ ఫీవర్‌తో దేశంలోని మిగతా నగరాలూ ఊగిపోయినట్టే భాగ్యనగరం కూడా  పరుగుల జడివానలో తడిసి ముద్దయ్యేది. కానీ మాయదారి రోగం  కరోనా కారణంగా  మధ్యలో మూడు సీజన్లు  ఆంక్షల వలయంలో జరిగిన ఐపీఎల్.. ఈ సీజన్ నుంచి  ‘ఇంటా బయటా’ (హోం అండ్ అవే)   విధానంలో జరుగుతున్నది.  

హైదరాబాద్ లో మ్యాచ్ లు  

⦿  ఏప్రిల్ 2వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ (వేదిక)
 
⦿  ఏప్రిల్ 9వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్
 
⦿  ఏప్రిల్ 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్
 
⦿  ఏప్రిల్ 24వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
 
⦿   మే 4వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్
 
⦿  మే 13వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్
 
⦿   మే 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్

ఉప్పల్ దంగల్‌లో.. 

2004లో నిర్మితమైన  ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు  64 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో గతంలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్  మ్యాచ్ లను తీసేస్తే..   2013 నుంచి డీసీ స్థానంలో వచ్చిన  సన్ రైజర్స్ హైదరాబాద్ 49 మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ  హై స్కోరింగ్ గేమ్స్ కంటే  మోస్తారు (130 - 160) స్కోర్లే ఎక్కువగా నమోదయ్యాయి.  100 -150 మధ్య స్కోర్లు  ఏకంగా 32 సార్లు నమోదయ్యాయి.  200 ప్లస్  స్కోర్లు 8 సార్లు రికార్డయ్యాయి. ఉప్పల్ లో  తొలుత  బ్యాటింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్ లను గెలవగా   ఛేదన చేసిన  జట్టు  37  సార్లు గెలిచింది. ఉప్పల్ లో భారీ స్కోర్ల గేమ్స్ కంటే  లో డిఫెండింగ్ స్కోర్లే ఎక్కువ.  బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అనుకూలించే ఈ పిచ్  పై  ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ల గురించి హైదరబాద్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. 

Published at : 01 Apr 2023 09:27 PM (IST) Tags: Hyderabad TS News IPL 2023 Metro rail Uppal SRH Vs RR

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

టాప్ స్టోరీస్

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం