News
News
X

Kothaguda Flyover : గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ సమస్యకు చెక్, రేపు కొత్తగూడ ఫ్లెఓవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Kothaguda Flyover : సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థలో భాగంగా నిర్మించిన కొత్తగూడ ఫ్లైఓవర్ ను ఆదివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

FOLLOW US: 
Share:

Kothaguda Flyover : భాగ్యనగరం మణిహారంలో మరో ఫ్లైఓవర్ చేరుతుంది. కొత్తగూడ ఫ్లైఓవర్ ను ఆదివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేదుకు కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మించారు. రూ.263 కోట్ల వ్యయంతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు 2216 మీ. పొడవుతో ఈ పై వంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. హైదరాబాద్ లో సిగ్నల్‌ రహిత రవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎస్ఆర్డీపీ కింద ఈ నిర్మాణం చేపట్టారు. 

ట్రాఫిక్ సమస్యకు చెక్ 

 కొత్తగూడ ఫ్లైవర్‌ తో బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ల మధ్య సాఫీగా ప్రయాణించేందుకు వెసులుబాటు కలుగుతుంది. కొత్తగూడ-గచ్చిబౌలి ఫ్లైఓవర్‌  ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినల్ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు ఐదు లేన్లతో, బొటానికల్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు ఆరు లేన్లు, కొత్తగూడ జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు మూడు లేన్ల రోడ్డుతో నిర్మించారు. కొత్తగూడ నుంచి హైటెక్‌ సిటీ వెళ్లేందుకు 383 మీటర్ల పొడవుతో హైటెక్‌ సిటీ వైపు మూడు లేన్ల డౌన్‌ ర్యాంపును, మసీదుబండ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వైపు రెండు లేన్లతో బొటానికల్‌ అప్‌ ర్యాంపు నిర్మించారు. హఫీజ్‌పేటకు వెళ్లేందుకు 470 మీటర్ల పొడవుతో మూడు లేన్లతో అండర్‌ పాస్‌ను నిర్మించారు.  ఈ జంక్షన్‌ల పరిసరాల్లో అనేక ఐటీ కంపెనీలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు... మియాపూర్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ పరిసర ప్రాంతాలను ఈ ఫ్లెఓవర్ తో అనుసంధానించారు. ఆదివారం అందుబాటులోకి వస్తున్న ఈ ఫ్లై ఓవర్ తో బొటానికల్ గార్డెన్,  కొత్తగూడ జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది. దీంతో కొండాపూర్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం లభించనుంది. 

ఇటీవలె శిల్పా లేఅవుట్ ఫ్లెఓవర్ ప్రారంభం 

సైబరాబాద్‌ ఏరియాలో శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ను తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్‌లో 300 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని సాయంతో ఔటర్ రింగ్‌ రోడ్‌ నుంచి సిటీలోకి ఎంట్రీ అవడం సులభం అవుతుంది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్‌చెరు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటు, శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు ఈజీగా వెళ్లే వీలుకలుగుతుంది. అయితే గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఫ్లై ఓవర్‌ పొడవు 2వేల 810 మీటర్లు ఉంది. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు.  ఈ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి జంక్షన్‌లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. హెచ్‌కేసీ పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఈ ఫ్లై ఓవర్‌తో ఎంతో సదుపాయం కలగనుంది. మరీ ముఖ్యంగా హైటెక్‌ సిటీ, హెచ్‌కేసీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు కూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మెరుగైన రవాణాయే లక్ష్యంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ..  SRDP కింద మొత్తం 47 పనులు చేపట్టింది. ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు కంప్లీట్‌ అయ్యాయి. మరో 16 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. కంప్లీటైన 31 పనుల్లో ఆల్రెడీ 15 ఫ్లైఓవర్లు అందుబాటులోకొచ్చాయి. సిటీలోకి ఎంటరవ్వాలంటే ఎక్కువమందికి ఇదే కీలక మార్గం. ఫ్లైఓవర్ల పరంపర ఇక్కడితోనే ఆగిపోలేదు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు వచ్చాయి. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్‌, మరొకటి శిల్పా లేఅవుట్‌ బ్రిడ్జ్‌.  

Published at : 31 Dec 2022 07:36 PM (IST) Tags: Hyderabad Gachibowli Flyover Minister KTR Kothaguda

సంబంధిత కథనాలు

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం