అన్వేషించండి

CM KCR : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తుంది - సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని పండుగలా మార్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు.

CM KCR  : తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని తెలిపారు. “జాతీయ రైతు దినోత్సవాన్ని” (కిసాన్ దివస్ ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.  ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు నేటి స్వరాష్ట్రంలోని రైతు సంక్షేమం వ్యవసాయం పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మక దిశగా అభివృద్ధి చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలుచేస్తుందన్నారు. దేశ వ్యవసాయరంగ నమూనా మార్పులో తెలంగాణ వ్యవసాయ రంగాభివృద్ధి బాటలు వేసిందని  కేసీఆర్ తెలిపారు. 

సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ 

తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని పండుగలా మార్చడంతో పాటు, దేశానికే అన్నపూర్ణగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేథో మథనం దాగి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా, లెక్కచేయకుండా పట్టుదలతో  అడ్డంకులను అధిగమిస్తూ  రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

స్పిన్ ఆఫ్ ఎకానమి

వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి అన్ని రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయరంగంతోనే దేశ  సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించడంతో వ్యవసాయ అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమౌతుందన్నారు. అది “స్పిన్ ఆఫ్ ఎకానమి” కి దారి తీసి సుస్థిరాభివృద్ధి’ జరుగుతుందని సీఎం అన్నారు. ప్రాథమికరంగమైన వ్యవసాయంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో  కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. దీని ప్రభావం, ద్వితీయ, తృతీయరంగాలైన పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందన్నారు. ఇదే సూత్రాన్ని అనుసరించి అన్ని రంగాల్లో వృద్ధిరేటు ఊహించని రీతిలో  నమోదవుతుందన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలకు దోహదం చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

రైతు సంక్షేమ విధానం

విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలు వృత్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ఇటువంటి రైతు సంక్షేమ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్ఫూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ తో దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget