Khammam: ఇన్‌స్టాగ్రామ్‌లో సిలిండర్ డెలివరీ బాయ్ పాడు పని! బాలిక ఫిర్యాదు - పక్కా ప్లాన్‌తో పట్టేసిన పోలీసులు
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఆ మధ్య ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలకి స్మార్ట్ ఫోన్‌లు కొనిచ్చారు. అటు తరగతులతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ పిల్లలు బిజీ అయ్యారు.
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని 8వ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు వేధించాడు. మార్ఫింగ్ చేసిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, లేకుంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని.. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఆ మధ్య ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. పిల్లల చదువులు పాడుకావద్దని తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్‌లు కొనిచ్చారు. ఇంకేముంది అటు తరగతులతోపాటు ఇటు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలోనూ పిల్లలు బిజీ అయ్యారు. ఇదే అదనుగా కొందరు సోషల్ మీడియాలో బాలికలను బ్లాక్ మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన ఓ బాలికకు కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతుల కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. బాలిక ఇన్‌స్ట్రాగామ్‌లో తన అకౌంట్ ఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ గా పని చేసే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. బాలికతో పరిచయం పెంచుకున్న సిద్దేశ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరుచూ వాట్సప్ వీడియో కాల్ చేస్తుండేవాడు. ఇదే క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న నిందితుడు బాలికతో అశ్లీల ప్రదర్శన చేయించాడు.
దానిని వీడియో రికార్డింగ్ తీశాడు. ఆ తర్వాత రూ.10 వేలు ఇవ్వకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఇదే కాకుండా కొన్ని ఫోటోలు, వీడియోలు తన స్నేహితులకు పంపడంతో వారు కూడా బాలికను ఫోన్‌లో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. వీరి వేదింపులు తట్టుకోలేని బాలిక విషయం తన తండ్రికి తెలిపింది.
Also Read: Daggubati Rana : ఫిలింనగర్ స్థలం వివాదంలో కోర్టుకు హాజరైన హీరో రానా
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు..
బాలిక తండ్రి ఫిర్యాదు సేకరించిన పోలిసులు సిద్దేశ్‌ను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. సింగరేణి సీఐ ఆరీఫ్ ఖాన్, ఎస్సై కుసుమ కుమార్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఖమ్మం వరకు రప్పించారు. అతను నమ్మేలా చేసి ఖమ్మం పట్టణానికి వచ్చేలా చేశారు. డబ్బులు వస్తాయని ఆశపడిన సిద్దేశ్ ఖమ్మం వచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. చిన్నారులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్న తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారనే విషయంపై తరచూ నిఘా వేస్తే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదని పోలీసులు తెలిపారు.