Daggubati Rana : ఫిలింనగర్ స్థలం వివాదంలో కోర్టుకు హాజరైన హీరో రాణా
Daggubati Rana : సినీ హీరో దగ్గుబాటి రాణా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఫిలింనగర్ లో ఓ స్థలం లీజుకు సంబంధించిన కేసులో ఆయన కోర్టుకు వచ్చారు.
Daggubati Rana : సినీ నటుడు దగ్గుబాటి రాణా ఓ స్థలం లీజు వివాదంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014లో ఫిలింనగర్ లోని స్థలాన్ని ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే లీజ్ లో ఉన్న భూమిని దగ్గుబాటి సురేష్ తన కుమారుడు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే దగ్గుపాటి రాణాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. ఇవాళ జరిగిన విచారణకు రాణా హజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది కోర్టు.
లీజు వివాదం
ఫిలింనగర్ లోని స్థలం వివాదంపై సిటీ సివిల్ కోర్టుకు హీరో దగ్గుపాటి ఇవాళ హాజరయ్యారు. ఫిలింనగర్ లో 2200 గజాల స్థలాన్ని 2014 లో ఓ వ్యాపారి లీజ్ కు తీసుకున్నారు. ఈ లీజ్ అగ్రిమెంట్ 2016, 2018లో పునరుద్ధరించారు. అయితే ఇంకా లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుండగానే దగ్గుపాటి సురేష్ తన కుమారుడు సినీ హీరో రాణా పేరు మీద 1000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా లీజ్ ఉండగా స్థలం నుంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారని, ఆర్థికంగా నష్టపరిచారని సదరు వ్యాపారి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు దగ్గుపాటి రాణాకి నోటీసులు జారీ చేసింది. ఇవాళ సిటీ సివిల్ కోర్టు జరిగిన విచారణకు రాణా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.