News
News
X

BRS Vs BJP Poster War : హైదరాబాద్ లో దిల్లీ లిక్కర్ స్కామ్ పోస్టర్ల కలకలం, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు!

BRS Vs BJP Poster War : హైదరాబాద్ లో దిల్లీ లిక్కర్ స్కామ్ పై పోస్టర్లు వెలిశాయి. సీఎం కేసీఆర్ కుటుంబంతో పాటు ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.

FOLLOW US: 
Share:

BRS Vs BJP Poster War : బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ల వార్ కొనసాగుతోంది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. తాజాగా హైదరాబాద్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈసారి సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్సీ కవితతో పాటు సీఎం కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ పరువు తీశారని, కల్వకుంట్ల దొంగ ముఠా అని హైదరాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు పెట్టారు. దిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ, విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కక్షసాధింపు రాజకీయం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, అవినీతి చేశారని బీజేపీ వాదిస్తుంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టర్లు పెడుతున్నారు. 

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు 

బీజేపీ-బీఆర్ఎస్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా, బీజేపీకి వ్యతిరేంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దిల్లీలో కూడా కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద కంటోన్మెంట్ గ్రౌండ్ లో మోదీ దశకంఠుని రూపంలో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం నేతలు ఆ ఫ్లెక్సీని చించివేశారు. దశకంఠుడి రూపంలో మోదీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పది తలల కింద ఈడీ, సీబీఐ, ఐటీ, అదానీ, ఈసీ, డీఆర్ఐ, ఐబీ, ఎన్సీబీ,ఎన్ఐఏ తొమ్మిది తలలుగా మధ్యలో మోదీ ఫొటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీ పైన ప్రజాస్వామ్య విధ్వంసకుడు, వంచనకు తాత అని రాశారు. ఈ ఫ్లెక్సీని బీజేవైఎం నేతలు చించివేసి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్ఎండీసీ ఛైర్మన్ క్రిషాంక్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిల్లీలో బైబై మోదీ ఫ్లెక్సీలు 

లిక్కర్ స్కామ్‌ కేసులో దిల్లీలో విచారణ జరుగుతున్న సమయంలో భారీగా పోస్టర్లు వెలిశాయి. బైబై మోదీ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో కనిపించిన ఈ పోస్టర్లపై చాలా బీజేపీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కమలం కండువా కప్పుకుంటే చాలా కేసులు మాఫీ అంటూ వాషింగ్ పౌడర్‌ వేసి అంతక ముందు ఆ తర్వాత అనేది సూచిస్తూ పోస్టర్లు కనిపిస్తున్నాయి.  తెలంగాణలో  ఈ మధ్య కాలంలో సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. ఏదైనా మెయిన్ ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని సమర్థిస్తూనో వ్యతిరేకిస్తూనో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు, ఫెక్సీలు వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి పోస్టర్లు దిల్లీలో కూడా ఏర్పాటు చేశారు.  దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుంది. ఈటైంలో ఆమెకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. అదే టైంలో బీజేపీని విమర్శిస్తూ దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతూ ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది అనే విమర్శలతో దిల్లీ వ్యాప్తంగా భారీగా పోస్టర్లు వెలిశాయి.  

Published at : 18 Mar 2023 09:13 PM (IST) Tags: Hyderabad MLC Kavitha KCR Family Delhi Liquor Scam BJP Vs BRS Poster war

సంబంధిత కథనాలు

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

టాప్ స్టోరీస్

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం

Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం

Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో

Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో