By: ABP Desam | Updated at : 01 Apr 2023 02:32 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రాజాసింగ్
Case On Raja Singh : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు అయింది. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ స్పీచ్ పై అభ్యంతరం తెలిపిన ఎస్సై వీరబాబు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అఫ్జల్ గంజ్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. శోభాయాత్రలో తన కొడుకుని పరిచయం చేస్తూ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజా సింగ్ పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అఫ్జల్ గంజ్ పోలీసులు. తాజాగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇతర కమ్యూనిటీలను కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ముంబయిలో కేసు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇటీవల ముంబయిలో కేసు నమోదు అయింది. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పై IPC section 153A 1(a) కింద కేసులు నమోదు అయ్యాయి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై ఆరోపణలు ఉన్నాయి. జనవరి 29న ముంబయిలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్‌పై గ్రేటర్ ముంబయి పోలీసులు దాదర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రాజా సింగ్‌పై IPC సెక్షన్ 153-A (1) (a) కింద కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
లవ్ జిహాద్ పై వ్యాఖ్యలు
ముంబయి ర్యాలీలో పాల్గొన్న రాజా సింగ్ దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో 'లవ్-జిహాద్' గురించిమాట్లాడారు. "హిందూ సమాజం అంతా కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన సోదరీమణులు, కుమార్తెలు ఈ వ్యవస్థీకృత పథకాలకు బలిఅవుతున్నారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని నేను ప్రతి హిందువును కోరుతున్నాను." అని రాజాసింగ్ అన్నారు.
రాజాసింగ్ పై పీడీ యాక్ట్
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసులో రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్
Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!
Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో