By: ABP Desam | Updated at : 27 Feb 2023 08:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అమిత్ షా
BJP Leaders Delhi Tour : తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలకు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రేపు(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ స్కాం లో దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్, లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ ఆసక్తి రేపుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ముఖ్యనేతలు దిల్లీకి
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు దిల్లీ నుంచి పిలుపువచ్చింది. మంగళవారం దిల్లీలో అందుబాటులో ఉండాలని బీజేపీ అధిష్ఠానం నుండి పిలుపు వచ్చింది. దీంతో దిల్లీ వెళ్లనున్న తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మినీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, దిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై ముఖ్య నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయంపై బీజేపీ మినీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరుకానున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు సీనియర్ నేతలు దిల్లీ బయలుదేరి వెళ్లారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు ముఖ్య దిల్లీ రావాలని ఆదేశించినట్లు సమాచారం.
బండి సంజయ్ కు భద్రత పెంపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. మార్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ, తాజా రాజకీయాలపై చర్చించేందుకు అందుబాటులో ఉండాలని బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకు బండి సంజయ్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల స్టీరింగ్ కమిటీలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. వీళ్లంతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో సహా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందని సమాచారం. అలాగే రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ కు పోలీస్ భద్రత పెంచారు. ప్రస్తుతం ఉన్న దానికంటే అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం కూడా ఏర్పాటు చేశారు. పర్యటనలప్పుడు బండి సంజయ్ కు అదనపు భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్ లో సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘావర్గాలు సూచించిడంతో పోలీసులు అదనపు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు - గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీకి గుర్తింపు
TSPSC Paper Leak Case: సిట్ ఆఫీసులో ముగిసిన అనితా రామచంద్రన్ విచారణ
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...
LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!
NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు
AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...