Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!
Bandi Sanjay Son : మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేయడంపై బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోరారు.
Bandi Sanjay Son : తోటి విద్యార్థులపై దాడి చేసిన ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను జనవరి 20న మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీంతో బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్టుకు తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు భగీరథ్. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.... భగీరథ్ సస్పెన్షన్ పై స్టే విధించింది. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మార్చి 9న హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. హై కోర్టు ఆదేశాలతో బండి భగీరథ్ పరీక్షలు రాశారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరథ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.
వీడియోలు వైరల్
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తోటి విద్యార్థులను దూషించి కొడుతున్న రెండు వీడియోలు ఇటీవల వెలుగుచూశాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో రాజకీయ దుమారంరేగింది. బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవాలని రాజకీయవర్గాల నుంచి కూడా డిమాండ్ వచ్చింది. వరుస వివాదాలు, కేసుల కారణంగా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. తన వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేశారని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది.
బండి సంజయ్ ఆగ్రహం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. తోటి విద్యార్థులు దూషిస్తూ కొడుతున్న వీడియోలు వెలుగుచూశాయి. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్సిటీలో చదువుతున్న సాయి భగీరధ్.. ఓ జూనియర్ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలపై కేసులు ఏంటని ప్రశ్నించారు. తాను తప్పు చేశాను అందుకే కొట్టాడని బాధితుడే చెప్పాడని మరి అలాంటి సమయంలో కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలే కానీ పిల్లలను అడ్డం పెట్టుకొని ఏం రాజకీయం అంటూ మండి పడ్డారు.
దుండిగల్ పోలీస్ స్టేషల్ లో కేసు
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేంద్ర యూనివర్సిటీలో సాయి భగీరథ్ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే క్రైం నెంబర్ 50/2023 యూ/ఎస్ 341, 323, 504, 506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సాయి భగీరథను విచారణకు పిలిచారు. న్యాయవాది కరుణ సాగర్ సమక్షంలో పూచీకత్తుపై సాయి భగీరథ్ కి పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ కు తీసువస్తామని న్యాయవాదులు హామీ కూడా ఇచ్చారు. అవసరం అయినప్పుడు పిలుస్తామని దుండిగల్ సీఐ అన్నారు.