కు.ని ఆపరేషన్ల విషాదంపై హెచ్‌ఆర్సీ సీరియస్ - నివేదిక ఇవ్వాలని ఆదేశం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా మహిళలు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకోవడంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
Crime News : ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కమిషన్ ఘటనపై సమగ్రమైన నివేదికను అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అక్టోబర్ 10 తేదీ లోపు నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ కేసుల్లో మరికొంత మందికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో 18 మందికి డాక్టర్లు టెస్టులు చేశారు. ఇందులో 12 మందికి ఇబ్బందులు ఉండటంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే ఏడుగురిని అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయగా..ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిందన్న డీహెచ్
ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. 34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని చెప్పారు. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తోందని చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.
ఏపీకి డబ్బులు కట్టబోం - కేంద్రం ఆదేశాలపై కోర్టుకెళ్తామన్న జగదీష్ రెడ్డి
కు.ని ఆపరేషన్ చేయించుకున్న మరో 30 మంది పరిస్థితి క్షేమం
ప్రస్తుతం 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాకుండా చనిపోయిన మహిళల పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించనున్నారు. గత 75 సవత్సరాల నుంచి మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కేంద్రం గైడ్ లైన్స్ తో గుర్తించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 2016 వరకూ లక్ష్యాలు పెట్టేవారు కానీ మహిళల్లో చైతన్యం పెరగడంతో మహిళలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అయితే ఎక్కడ తప్పు జరిగిందో వైద్యులు నివేదిక సిద్ధం చేయనున్నారు.
తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు, కాంట్రాక్టులు - రేవంత్ రెడ్డి
మృతుల కుటుంబాలకు పలు రకాల సాయం ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.