అన్వేషించండి

Revanth Reddy : తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు, కాంట్రాక్టులు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఒత్తిడి చేయడం, నజరానాలతో కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు, కాంట్రాక్ట్ లు అని విమర్శించారు.

Revanth Reddy : సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన... బీజేపీ , టిఆర్ఎస్ లు ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కొందరు నేతలు కాంగ్రెస్ ను విడిచిపోతూ పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధుల కొనుగోలు కోసం టిఆర్ఎస్, బీజేపీ లు కమిటీలు వేశాయని విమర్శించారు.   మునుగోడులో నేతల కొనుగోలు పక్రియ జరుగుతుందన్నారు.  మునుగోడులో నాయకుల జేబులు నిండాయి తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. డిండి ప్రాజెక్టు ఆలస్యం అవ్వడం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల నల్గొండ జిల్లాకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం చేశాయని ఆరోపించారు.

సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్ 

"సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అదే రోజు ఇంటి ఇంటికి ప్రచారం మొదలుపెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు కాస్త టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా పోయింది. నా పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు కలెక్టరేట్ లు ప్రారంభిస్తే నన్ను ఆహ్వానించలేదు. నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభిస్తే ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆహ్వానించకపోగా హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన ఆర్మీ జవాన్ ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా? "- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు  

మోడీకి గులాం 

ఇతర రాష్ర్టాలలో టీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును దిల్లీ, పంజాబ్, బిహార్ రాష్ట్రాలకు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు..కాంట్రాక్ట్ లు అని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమన్నారు. ఇలాంటి మోడల్ తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. సందట్లో సడేమియాలా గులాంనబీ ఆజాద్ మోడీకి గులాంగా మారారన్నారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని, గులాంనబీ అజాద్ కాంగ్రెస్ ను నిందిస్తున్నారన్నారు. రాజ్యసభ రెన్యూవల్ కాలేదని ఆజాద్ పార్టీ వీడారని ఆరోపించారు. గుజరాత్ లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేతిలో ఆజాద్ కీలుబోమ్మలాగా మారారన్నారు. 

Also Read : ఘన్‌పూర్‌లో TRS వర్గపోరు: నీ చరిత్ర తీస్తే బయటతిరగలేవు - రాజయ్యకు కడియం స్ట్రాంగ్ కౌంటర్

Also Read : KCR National Politics : "రైతు రాజకీయం" సాధ్యమేనా ? కేసీఆర్ జాతీయ రాజకీయాల " ఈక్వేషన్స్ " వర్కవుట్ అవుతాయా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget