అన్వేషించండి

Local Elections Stop: తెలంగాణ సర్కార్‌కు షాక్- జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే - లోకల్ ఎన్నికలు ఆగిపోయినట్లే !

BC Reservations Issue: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జీవో ఆధారంగా వచ్చిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఆగిపోయినట్లే.

High Court stays BC Reservations GO:  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో ఆధారంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం అసాధ్యంగా మారింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.తరువాత రిప్లైలు దాఖలు చేసేందుకు పిటీషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది ధర్మాసనం. 

బిల్లు ఆమోదం పొందినట్లేనని వాదించిన అడ్వకేట్ జనరల్ 

పంచాయతీ రాజ్ చట్టంలో 285-ఏ సెక్షన్‌ను సవరించే బిల్లుకు రాష్ట్రపతి డ్రౌపది ముర్ము ఆమోదం తెలిపి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం దానిని అధికారికంగా నోటిఫై చేసి, 42% బీసీ కోటాను అమలు చేసి ఉండేది.  ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉంది, కానీ ఆమోదం లేకున్నా ప్రభుత్వం గో (గవర్నమెంట్ ఆర్డర్) నెం. 9 ద్వారా కోటాను ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం, గవర్నర్‌కు బిల్లు అందిన తేదీ నుంచి 1 నెల (కొన్ని సందర్భాల్లో 3 నెలలు) గడువులో ఆమోదం ఇవ్వకపోతే, అది స్వయంచాలకంగా చట్టంగా (డీమ్డ్ పాస్డ్) పరిగణించాలి.  తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతి అమలులో ఉందని, తెలంగాణలో కూడా ఇది వర్తిస్తుందని ఏజీ వాదించారు. ఈ బిల్లు ఇంకా ఆ కాలపరిమితి లోపల ఉంది కాబట్టి, ఆమోదం లేకున్నా చట్టబద్ధమేన్నారు. సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని  హైకోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. . బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు.  బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు.  బీసీల సంఖ్యపై పిటిషన్లకు అభ్యంతరం లేనప్పుడు .. వారికి రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.   గవర్నర్ గడువు ముగిసిన తర్వాత బిల్లు చట్టంగా మారితే, ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇది స్వయంచాలకంగా అమలులోకి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే బీసీ కమిషన్ సిఫార్సులు, కుల సర్వే డేటా (56.36% బీసీలు) ఆధారంగా గో ప్రకటించింది, ఇది ట్రిపుల్ టెస్ట్ (సైంటిఫిక్ డేటా, కమిషన్ సిఫార్సు, పబ్లిక్ కన్సల్టేషన్) పాటించిందని ఏజీ స్పష్టం చేశారు.   

ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రవి వర్మ కూడా వాదనలు వినిపించారు. అగ్రకులాలు ఉన్నది కేవలం 15 శాతం మాత్రమే.. వాళ్ళకేంటి నష్టమని ప్రస్నించారు. ఇంకా 33 శాతం మిగిలే ఉంటుంది.. వాళ్లకు ఏ విధంగా నష్టం లేదన్నారు. 15 శాతం ఉన్నవాళ్ళు ఎలా రిజర్వేషన్లు అడ్డుకుంటారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై యాబై శాతం నియంత్రణ రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని.. ఎమ్మార్ బాలాజీ vs స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ధర్మాసనం ముందు ఉంచారు.  

జీవోపై స్టే రావడం వల్ల ఆ జీవో ఆధారంగా ఇచ్చిన ఎన్నిక నోటిఫికేషన్ చెల్లదు కాబట్టి .. ఎన్నికల నిర్వహణపై..  ఎస్‌ఈసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Owaisi College Lake Encroachment : కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!
కాంగ్రెస్‌కు కంటి చూపు సమస్యా? ఒవైసీ కాలేజీపై హైడ్రా ఎందుకు ఉలకదు?: బండి సంజయ్ ఫైర్!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget