By: ABP Desam | Updated at : 27 Jul 2023 05:41 PM (IST)
Edited By: jyothi
మున్నేరు వరదల్లో చిక్కుకుపోయిన ఏడుగురు - ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ ( Image Source : Minister Puvvada Ajay Kumar Twitter )
Heavy Floods: ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు సిబ్బంది చాలా కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు చేపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉద్ధృతి, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయని ముఖ్యమంత్రి మంత్రి పువ్వాడను అడిగి తెలుసుకుంటున్నారు. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహా భద్రాచలం నుంచి మంత్రి పువ్వాడ ఖమ్మంకు వెళ్లారు. మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం చెప్పినట్లు వివరించారు. ఆయన ఆదేశాల మేరకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని... ప్రత్యేక డ్రోన్ ద్వారా ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు ఖణ్మం జిల్లా అధికారులు వెల్లడించారు.
#Bhadrachalam లో కరకట్ట, గోదావరి వంతెనపై నుండి వరద ఉదృతిని పరిశీలించి జిల్లా @Collector_BDD కి పలు సూచనలు చేయడమైంది. వరదలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడమైంది.@TelanganaCMO @KTRBRS @MinisterKTR @RegaKantha @TelanganaCS… pic.twitter.com/PYpGms8Q2W
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 27, 2023
నిర్విరామంగా కురుస్తున్న వర్షాల ధాటికి మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని @Collector_KMM ను ఆదేశించడమైంది.@MC_Khammam నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు… pic.twitter.com/K5H7pZedYQ
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 27, 2023
ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ ధ్యాన మందిరంలో ఉన్న ఏడుగురిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. వరద ఉద్ధృతితో సహాయక చర్యలకు తీవ్ర ఆంటంకం కల్గుతోంది. అయితే మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు వరదల్లో చిక్కిన శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలోని ఏడుగురు పేర్లను తెలిపారు. 55 ఏళ్ల లక్ష్మీ నారాయణ, 50 ఏళ్ల లక్ష్మీ, 26 ఏళ్ల యశ్వంత్, 34 ఏళ్ల అరవింద్, రెండేళ్ల విఘ్నేష్, 27 ఏళ్ల ప్రవల్లిక, 26 ఏళ్ల కావ్యగా గుర్తించారు. ఆ ఏడుగురు బాధితులను అధికారులు సురక్షితంగా రక్షించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఎగువ నుండి భారీగా వచ్చి చేరుతున్న నీరు. @MC_Khammam నగరంలోని ప్రకాష్ నగర్ చెక్ డ్యాం వద్ద మున్నేరు ఉదృతిని పరిశీలించడమైంది..
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 23, 2023
మున్నేరు పరివాహక లోతట్టు ప్రాంతాల నిర్వాసితులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు… pic.twitter.com/X38ibfaKxW
అలాగే నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలని లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, బొక్కల గడ్డ, జలగం నగర్, FCI, దానవాయి గూడెం ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి అధికారులకు సూచించారు ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వివరించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం.. ప్రభుత్వం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
KTR Tweet: 'చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా' - అసలైన ఫలితాలు శుభవార్త ఇస్తాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
Telangana Cabinet Meet : సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ - ఫలితాలపై కేసీఆర్ గట్టి నమ్మకం !
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Top Headlines Today: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్; ఏపీ చర్యలు కరెక్టేనన్న అంబటి - నేటి టాప్ న్యూస్
Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>