News
News
X

Bandi Sanjay : లిక్కర్ స్కామ్ పై చర్చ జరగకూడదనే మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు - బండి సంజయ్

Bandi Sanjay : దిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే మతవిద్వేషాలు రెచ్చగొట్టారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

FOLLOW US: 

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా బీజేపీ కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు బీజేపీ సిద్ధాంతం అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు బండి సంజయ్.  

మత విద్వేషాలు రెచ్చగొట్టారు 

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1400 మంది ప్రాణాలు అర్పించారన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్లు కేసీఆర్‌ పీఠం ఎక్కారన్నారు.  మునావర్‌ ఫరూఖీని హైదరాబాద్ రప్పించి మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఆరోపించారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  సీఎం చెబితే గొడవలు అవుతాయి, ఆగుతాయని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు బండి సంజయ్. 

లిక్కర్ స్కామ్ ఆరోపణలే కారణం 

"దిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు నన్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ ఒక్కటే కాదు తెలంగాణలో ఈడీ అధికారులు ఏ కంపెనీపై దాడులు చేసినా అందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందో లేదో తెలపాలి. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల లెక్కలు బయటకు తీస్తున్నాం. హిందూ దేవతలపై వ్యంగ్యంగా మాట్లాడిన కమెడియన్ కు 2000 వేల మంది పోలీసుల భద్రత మధ్య షో పెట్టుకోవచ్చు. లిక్కర్ స్కామ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై చర్చ జరగకూడదని మునావర్ షరూఖీని తీసుకొచ్చి ఇక్కడ షో పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ షో పెట్టి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయలబ్ది పొందాలని చూశారు. పేదల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించడానికి పాదయాత్ర చేస్తే అనుమతి లేదు. అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే బీజేపీని బూచి చూపించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ టైంలో అధికారంలోకి రావడానికి మత ఘర్షణలు లేవనెత్తారు. సీఎం కేసీఆర్ తన పదవి కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే మతవిద్వేషాలు రెచ్చిగొట్టి బీజేపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   

Also Read : JP Nadda : కేసీఆర్ నయా నిజాం, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం - జేపీ నడ్డా

Also Read : Praja Samgrama Yatra : ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర, జేపీ నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనం

Published at : 27 Aug 2022 07:33 PM (IST) Tags: BJP Bandi Sanjay Hanumakonda TS News CM KCR Delhi Liquor Scam

సంబంధిత కథనాలు

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి