అన్వేషించండి

Governor Tamilisai : ప్రభుత్వాన్ని రద్దు చేస్తా అనలేదు, పాత వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు : గవర్నర్ తమిళి సై

Governor Tamilisai : తెలంగాణలో గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతోంది. తాజాగా గవర్నర్ తమిళి సై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య హాట్ హాట్ గా విమర్శలు కొనసాగుతున్నాయి. గవర్నర్, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతున్న క్రమంలో తమిళి సై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా విమర్శించారన్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారని గవర్నర్ గుర్తుచేశారు. తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో భేదాభిప్రాయాలున్నా రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారన్నారు. తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తానన్న ఆమె రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. తనకి రాజకీయం చెయ్యాలనే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. ఇటీవల గవర్నర్ తమిళి సై దిల్లీలో పర్యటన చేశారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రానికి ఆమె ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ఆమె కేంద్రానికి తెలిపారని మంత్రులు ఆరోపించారు. దీంతో గవర్నర్ పై మంత్రులు వరుసగా విమర్శలు మొదలుపెట్టారు. 

ఆహ్వానాలకు రాజకీయాలు ఆపాదిస్తున్నారు

తాజాగా ఈ విషయాలపై స్పందించిన గవర్నర్ తమిళి సై తనపై మంత్రులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తే రాజకీయం అంటున్నారని, ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారన్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటమే తన లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. తన పర్యటనలో ప్రొటోకాల పాటించడంలేదన్న విషయంలో ఆమె స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో కేంద్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నానన్నారు. తన ఆహ్వానాలకు రాజకీయాలను ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వ విషయంలో ప్రతినెలా నివేదికలు ఇస్తున్నట్లు తెలిపారు. నివేదికలో అన్ని విషయాలను పేర్కొనడం జరుగుతుందన్నారు. 

గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం 

గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మద్య గ్యాప్‌ పెరిగినట్లు వార్తలు వినిపించడంతో ఏకంగా గవర్నర్‌ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయగా కొందరు మంత్రులు సైతం అంతే దీటుగా ప్రతి విమర్శలు చేశారు. ఈ పంచాయతీ కాస్తా డిల్లీ వరకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను అమలు చేయడం లేదని ప్రధాని నరేంద్రమోడికి, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిల్లీ నుంచి వచ్చిన గవర్నర్‌ తమిళ్‌ సై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని మీడియా సాక్షిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మద్య గ్యాప్‌ మరింతగా పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : Bhadrachalam: భద్రాచలానికి రైలులో వెళ్లిన గవర్నర్‌ - ప్రభుత్వం హెలికాప్టర్ ఇవ్వలేదా? తీసుకోలేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget