Gold-Silver Price: నేడు రూ.200 ఎగబాకిన పసిడి ధర.. వెండి ధర కూడా పైపైకి.. ప్రాంతాలవారీగా నేటి ధరలు ఇవే..
హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు రూ.20 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,950గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,590 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,590 గా ఉంది.
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.35 తగ్గి.. రూ.22,540 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!