By: ABP Desam | Updated at : 02 Apr 2022 06:48 AM (IST)
gold
Gold Rate Today 2nd Hyderabad: ఉక్రెయిన్‌పై రష్యాలు దాడులు కొనసాగుతుంటంతో మార్చి నెలలో బంగారం, వెండి ధరలలో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. కానీ ఏప్రిల్ తొలి రోజే బంగారం ధర భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. కొత్త ఆర్తిక సంవత్సరం తొలిరోజే బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. తాజాగా బంగారం ధర రూ.490 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rates Today In Hyderabad) రూ.48,100కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,470 అయింది. వెండి ధర రూ.400 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,700 కు ఎగబాకింది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rates In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.450 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 2nd April 2022) 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.490 మేర పెరగడంతో ఈ పట్టణాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 కు చేరింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.71,100 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,470 కి పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
చెన్నైలో రూ.440 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,340 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,730 కి చేరింది.
ప్లాటినం ధర
హైదరాబాద్‌లో ప్లాటినం ధర రూ.2 దిగిరాగా 10 గ్రాముల ధర రూ.24,080 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో 2 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.24,080 కి చేరింది.
చెన్నై 10 గ్రాముల ధర రూ.24,060 కి దిగొచ్చింది.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,080 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
CM KCR Appriciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!