అన్వేషించండి

Gaddar Controvery : గద్దర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలపై వివాదం - తప్పేం లేదన్న సజ్జనార్ !

గద్దర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలపై వివాదం ఏర్పడింది. పోలీసుల్ని అగౌరవపర్చడమేనని కొందరు అంటే.. తప్పేం లేదని సజ్జనార్ అంటున్నారు.

 

Gaddar Controvery : ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలను పోలీసు అధికారిక లాంఛనాలతో నిర్వహించడంపై కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం  నక్సలైట్  వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేన‌ని యాంటీ టెర్ర‌రిజం ఫోరం ప్రకటించింది.  గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించార‌ని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని వారు చెబుతున్నారు.  నక్సలిజం  సాధారణ పౌరులపై , జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని వెల్ల‌డించారు.               

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గద్దర్ పోరాాడారన్న యాంటీ టెర్రరిజం ఫోరం

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి  తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని యాంటీ టెర్ర‌రిజం ఫోరం తెలిపింది. చర్య , ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని కోరింది.

పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఆయన జేబులో చేయిపెట్టి డబ్బులు తీసుకొనేంత చనువు నాది: గద్దర్ వ్యాఖ్యలు వైరల్

నక్సలిజం వల్ల ఎన్నో పోలీసు కుటుంబాలు కుటుంబసభ్యులను కోల్పోయాయన్న ఏటీఎఫ్                                        

పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని, పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరింది. దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని పేర్కొంది. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని  యాంటి టెర్రరిజం ఫోరం  క‌న్వీన‌ర్ రావినూత‌ల శ‌శిధ‌ర్ డిమాండ్ చేశారు.

గద్దర్ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి- ఎల్‌బీ స్టేడియం వద్ద అభిమానుల బారులు

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పోలీసుల్ని అవమానించినట్లు కాదన్న   సజ్జనార్                          

అయితే యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరాన్ని  సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తోసిపుచ్చారు. గద్దర్ కి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం లో తప్పు లేదు.. 
పోలీసులను అగౌరవ పరిచినట్టు కాదన్నారు.  తెలంగాణ ప్రజల సమస్యలను తన గానం రూపంలో చాటి చెప్పారని..  ఓ గౌరవప్రదమైన వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం లో తప్పు లేదన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Telangana Cabinet:తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Granny OTT : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Donald Trump: ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Embed widget