అన్వేషించండి

Waddepally Municipality: వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రభంజనం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను దెబ్బకొట్టిన కవిత!

Telangana Municipal Elections Results 2026 | జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సొంతం చేసుకుని సత్తా చాటింది. కవిత మద్దతు తెలపడంతో గెలుపొందారని తెలుస్తోంది.

Waddepally Municipality Results 2026 | గద్వాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఓచోట ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండగా..  జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సొంతం చేసుకుంది.

ఇతర చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే, వడ్డేపల్లిలో మాత్రం ఫలితం విభిన్నంగా వచ్చింది. ఇక్కడి ఓటర్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి విజయాన్ని అందించారు. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఒక్కో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కవిత మద్దతుదారులు ఈ ఒక్క స్థానంలో ఓటర్లను మెప్పించారు.

కవిత ఎఫెక్ట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు షాక్..

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో, ఒక చిన్న పార్టీ ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. దాంతో ఇక్కడ ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా బరిలోకి దిగిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రధాన పార్టీలను కాదని, స్థానికంగా అందుబాటులో ఉండే నేతలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ విజయంతో వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఫలితం రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు ఒక విభిన్నమైన సందేశాన్ని పంపినట్లయ్యింది.

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.  నేరేడుచర్ల, హాలియా, నందికొండ, హుజూర్‌నగర్‌, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మంథని, చొప్పదండి, సుల్తానాబాద్, మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, కొడంగల్, నారాయణ ఖేడ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ లలో కాంగ్రెస్ విజయం సాధించింది. 
   
ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌లలో గెలుపొందింది. గద్వాల జోగులాంబ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నెగ్గింది. భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం విజయం సాధించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget