అన్వేషించండి

Telangana Municipal Elections Results 2026: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ

Congress Dominates BRS in Nalgonda | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ప్రస్తుతానికి మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పై ఏకపక్ష విజయాలు అందుకుంది.

Telangana Municipal Elections Results 2026 | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. శుక్రవారం వెలువడుతున్న ఫలితాల్లో నల్గొండ జిల్లాల్లో హస్తం పార్టీ దూసుకెళ్తోంది. జిల్లాలోని మూడు కీలకమైన మున్సిపాలిటీలు నందికొండ, హాలియా, చండూరులను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. జిల్లావ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, స్పష్టమైన మెజారిటీ సాధించిన ఈ మూడు పురపాలికల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. నేటి ఓట్ల లెక్కింపులో సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం ఫలితం మొదట వెలువడింది. ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది.

నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో విజయంతో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. అనంతరం హాలియా, చండూరు మున్సిపాలిటీల్లోనూ హస్తం పార్టీ మెజార్టీ వార్డుల్లో నెగ్గి విజయం సాధించింది. నందికొండ మున్సిపాలిటీలో  12 వార్డులకుగానూ 11 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని అందుకోవడంతో హస్తం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

చండూరు, హాలియా మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

హాలియా, చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపొందింది. హాలియాలో 10 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నెగ్గారు. చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 వార్డులు నెగ్గగా, 3 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది.

తెలంగాణ వ్యాప్తంగా జరిగి 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు జిల్లాల్లో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఈ జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Advertisement

వీడియోలు

Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget