Jeevan Reddy Shopping Mall : అద్దె చెల్లించరు - కరెంట్ బిల్లు కట్టరు - బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షాపింగ్ మాల్ సీజ్ !
Jeevan Reddy Shopping Mall : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పది కోట్ల రూపాయలు బాకీ ఉండటంతో షాపింగ్ మాల్‌కు కరెంట్ కట్ చేసి నోటీసులు ఇచ్చారు. నిన్నటిదాకా అధికారంలో ఉండటంతో అధికారులు గట్టిగా అడగలేకపోయారు.
Jeevan Reddy Shopping Mall : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జీవన్ మాల్ అనే షాపింగ్ మాల్ ఉంది. అయితే, ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ రెడ్డి ఈ మాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీకి జీవన్ మాల్.. ఎనిమిది కోట్ల రూపాయలను బకాయి పడ్డట్లు సమాచారం. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు. జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉండడంతో గతంలో నోటీసులు అందించారు. అయితే.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
కాళేశ్వరంపై ఏసీబీకి కంప్లైంట్ - అప్పుడే మెదలు పెట్టారా ?
ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా మారిందన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్మూరులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని మాల్ నిర్మించారు. నిబంధనల ప్రకారం అద్దెలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు.. కరెంట్ బ కాయిలు కూడా చెల్లించడం లేదు. కానీ ఆ మాల్ లోని ధియేటర్లను.. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. కానీ ఇంత కాలం అధికారంలో ఉండటం వల్ల ఆర్టీసీ అధికారులు.. కరెంట్ ఉద్యోగులు .. గట్టిగా అడగలేకపోయారు. ఏమైనా అంటే ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు ఉంటాయన్న కారణంగా ఆగిపోయారు .
హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
కానీ పది కోట్లకుపైగా రావాల్సి ఉండటంతో ప్రభుత్వం మారగానే అధికారులు కొరడా ఝుళిపించారు. అదే సమయంలో.. ఆర్మూరులో ఆయన కూడా స్వయంగా ఓడిపోయారు. ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. దీంతో ఇక ఆయన పవర్ పోయిందనుకుని అధికారులు బకాయిల కోసం రంగంలోకి దిగారు. తన మాల్ సీజ్ చేయడంపై జీవన్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఏకంగా పది కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండటంతో ఆయన కూడా ఏమీ చెప్పడం లేదు. మీడియాకు అందుబాటులోకి రాలేదు.