Telangana News : రెండో రోజు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు - రూ.1,278 కోట్లు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం !
వరుసగా రెండో రోజు తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది.
Telangana News : వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం నుంచి కొనసాగుతున్నది.. దీనిలో భాగంగా రెండో రోజైన మంగళవారం నాడు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. ఇప్పటి వరకు రెండు రోజుల్లో రెండురోజుల్లో 39,54,138 మంది రైతుల ఖాతాల్లో రూ.1,921 కోట్లు జమయ్యాయి. 38.42లక్షల ఎకరాలకు అంది రైతుబంధు సాయం అందింది. వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నది. ఈ సారి కొత్తగా 1.5లక్షల మంది పోడు రైతులకు సైతం ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. ఈ సారి మొత్తంగా 1.54కోట్ల ఎకరాలకు రూ.7,720.29కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన సోమవారం ఎకరం భూమి ఉన్న 22.55 లక్షల మంది రైతులకు తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయం అందించింది. ఈ మేరకు రూ. 642.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొత్తగా చేరిన లబ్దిదారులతో ప్రభుత్వం అదనంగా సుమారు మరో 300కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. రైతు బంధు పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరాకు రూ 5 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నారు. ఎప్పటి తరహాలోనే తొలి ప్రాధాన్యత కింద ఎకరం భూమి నిరుపేద రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకం డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి.
ఎకరం నుంచి రెండు ఎకరాలు, ఆ తరువాత మూడు ఎకరాలు ఉన్న రైతులు... ఇలా తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న వారి నుంచి మొదలై ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారి ఖాతాల్లో వరుస క్రమంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. వానాకాలం పంటల సీజన్ కావడంతో ఇప్పటికే కొంతమంది రైతులు అలుకుడు ప్రక్రియ చేపట్టి దున్నకాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవడం ఒకింత తీపి కబురే అయినప్పటికీ.. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, దున్నకాల ఖర్చు రూపంలో ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సాయం ఉపయోగపడుతోందని రైతులు అంటున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగు పనులు జరుగుతున్నాయి. ఓ వైపు పెట్టుబడి గోస లేకుండా ప్రభుత్వం రైతుబంధు పంపిణీ ప్రారంభించి పైసలు జమ చేస్తుండడంతో రైతులకు పెద్ద ఉపశమనం లభించింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial