అన్వేషించండి

Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

Water Falls: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్న వారికి అద్భుత అవకాశం. వర్షాలకు పొంగిపొర్లుతునన జలపాతాలు, హైదరాబాద్‌కు సమీపంలోనే కనువిందు చేస్తున్న నీటి ధారలు

Water Falls: చుట్టూ పచ్చని కొండలు...అంతెంతు నుంచి కిందకు జాలువారుతున్న జలపాతాలు (Water Falls), వాటి నుంచి వచ్చే లేలేత తుంపర్లు, చల్లని గాలులు...అబ్బ చెబుతుంటేనే మనసు ఎటో వెళ్లిపోతుంది కదా..మరి ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఇవన్నీ చూడాలంటే  ఏ కేరళనో లేక కర్ణాటక, తమిళనాడు వరకు వెళ్లాల్సి వస్తుందనుకుంటున్నారా..? అక్కర్లేదండీ మన హైదరబాద్‌(Hyderabad) చుట్టు పక్కలే బోలెడన్నీ వాటర్‌ఫాల్స్‌ ఉన్నాయి. పొద్దున వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం పదండి..

హైదరాబాద్‌కు చేరువలోనే...
హైదరాబాద్‌లో అడుగు బయటపెట్టామంటే  వాహనాలు సౌండ్లు, ట్రాఫిక్‌ ఇక్కట్లతో పిచ్చెక్కిపోతుంది. కొందరికి పచ్చిన చెట్లను చూసి కూడా ఎన్నో ఏళ్లు అవుతుంటుంది. ఈ బిజిబిజి లైఫ్‌ నుంచి కాస్త దూరంగా పారిపోయి ఏ ప్రకృతి ఒడిలోనో సేదతీరాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ జలపాతాన్నో చూస్తూ మైమరిచిపోదామని కలల కంటుంటారు. కానీ ఎక్కడికి వెళ్తాం...ఇప్పటికిప్పుుడు అనుకుంటే కుదిరేపని కాదులే అనుకుంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు. ఎందుకంటే మన హైదరాబాద్‌(Hyderabad) చుట్టుపక్కలే అలాంటి ప్రదేశాలో బోలెడు ఉన్నాయి. ఉదయం వెళ్తే సాయంత్రానికి తిరిగి వచ్చేయవచ్చు.

ఎత్తిపోతల
హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న అందమైన ప్రదేశం ఎత్తిపోతల(Eathipothala) వాటర్‌ఫాల్స్‌.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్లగానే అవతలి ఒడ్డునే ఉంటుంది ఈ అందమైన జలపాతం. దాదాపు 70 ‌అడుగుల ఎత్తు నుంచి నీరు కిందపడుతుంటే చూడటానికి ఎంతో అందగా ఉంటుంది. నాగార్జన్‌సాగర్(Nagarjunasagar) వెనక జలాల నుంచి మొదలయ్యే నక్కవాగు, తుమ్మలవాగు, చంద్రవంక వాగులు మూడ ఇక్కడ కలిసి ఎత్తైన కొండల మీదుగా కిందకు పడుతుంటాయి.ఇంకా ఇక్కడ మరోక విశేషం ఉంది. అది ఏంటంటే ఇక్కడ జాతీయ మొసళ్ల పెంపకం కేంద్రం కూడా ఉంది. కాస్త ధైర్యం చేసి కిందకు దిగారంటే వాటిని కూడా ఏంచక్కా చూడొచ్చు. సమీపంలోనే రంగనాథస్వామి,దత్తాత్రేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.హైదరాబాద్‌ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

మల్లెల తీర్థం జలపాతం
నాగర్‌కర్నూలు జిల్లాలోని దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో ఉన్న మల్లెలతీర్థం(Mallela Theertham) జలపాతం చూడడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. కృష్ణనది పాయ నుంచి విడివడి ఎత్తైన కొండల మీదుగా కిందకు పడుతున్న ఈ అందమైన ప్రదేశాన్ని తిలకించాలంటే మాత్రం...సుమారు 400 మెట్లు కిందకు దిగాల్సిందే.ముఖ్యంగా  యువతీ,యువకులకు ఇది ఎంతో నచ్చుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో జలపాతం అహా ఇది కదా మజా అంటే అన్నట్లు ఉంటుంది. ఇక్కడి చేరుకునే మార్గం కూడా పూర్తిగా నల్లమల అడవుల్లో నుంచే ఉంటుంది కాబట్టి ప్రకృతి ప్రియులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం. ఆధ్యాత్మికంగానూ ఈ తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి.  హైదరాబాద్‌ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం.
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

భీమునిపాదం జలపాతం
హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న మరో అందమైన జలపాతం భీమునిపాదం(Bheemuni Paadam) జలపాతం. మహబూబాబాద్‌ జిల్లా ఉన్న ఈ జలపాతం తెల్లని నురగలు కక్కుతూ 70 అడుగులు ఎత్తు నుంచి కిందకు పడుతుంటుంది. భారతంలోని భీముని పాదముద్రతోనే ఈ జలపాతం ఏర్పడిందని ప్రతీతి. చూడడానికి కూడా ఇది రాతిపాదం మీద నుంచి కిందకి పడుతున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్‌ నుంచి సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

పోచమ్మ జలపాతం
హైదరబాద్‌కు సమీపంలోనే మరో చూడదగ్గ జలపాతం పోచమ్మ(Pochamma) జలపాతం. నిర్మల్‌(Nirmal) సమీపంలో ఉన్న ఈ పోచమ్మ జలపాతం మంచి విశ్రాంతి విడిది కేంద్రం. చుట్టూ ప్రకృతి రమణీయత, పక్షుల కిలకిలరావాలతో మనల్ని మనం మర్చిపోవచ్చు. కడెం నదిపై ఉన్న ఈ జలపాతం వద్ద నీరు  40 అడుగుల ఎత్తు నుంచి దిగువకు దూకుతుంది. అయితే ఈ జలపాతం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న అత్యంత లోతైన జలపాతం కూడా ఇదే.ఇక్కడ నీళ్లల్లోకి దిగడం అత్యంత ప్రమాదకరం. ఆదిలాబాద్‌(Adhilabad) రైల్వేస్టేషన్‌కు కూడా దగ్గరలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా కారులోనైనా వెళ్లొచ్చు. లేదా రైలులో అయినా ఇక్కడికి చేరుకోవచ్చు.
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

కుంతాల జలపాతం
తెలంగాణలో ఉన్న అత్యం ఎత్తైన జలపాతం కుంతాల(Kuntala). ఆదిలాబాద్‌ జిల్లాలో కడెం నదిపై ఉన్న ఈ జలపాతం చూపురులను ఎంతో ఆకట్టుకుంటుంది. దాదాపు రెండువందల అడుగులకు పైగా   ఎత్తు నుంచి నీరు దిగువకు పడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ జలపాతం వరకు చేరుకోవాలంటే ఓ 15 నిమిషాలు పాటు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అక్కడి నుంచి మరో నాలుగువందలమెట్లు కిందకి దిగితే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే మరో జలపాతం గాయత్రి(Gayathri) జలపాతం. దీనికి మరోపేరే ముక్తిగుండం జలపాతం దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి ఇక్కడ కిందకు పడుతుంది. కుంతాల జలపాతానికి వచ్చిన వారు ఎక్కువగా   దీన్ని కూడా సందర్శిస్తుంటారు.
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

బొగతా జలపాతం
తెలంగాణలోనే అత్యంత సుందరమైన జలపాతం బొగతా(Bogatha). తెలంగాణ నయాగారాగా దీనికి పేరు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.తెల్లని నురగలు కక్కుతూ కిందకి దూకుతుంటే నీటిని చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు.ఎత్తైన కొండలపై నుంచి పడే నీటి శబ్ధం కిలోమీటర్‌ వరకు లయబద్ధంగా వినిపిస్తుంటుంది. హైదారబాద్‌ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

ఈ జలపాతాలన్నీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకున్న వారు దగ్గరిలోని ఓ జలపాతాన్ని చూసొచ్చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Embed widget