News
News
X

Fake CBI Officer Case : గ్రానైట్ కేసును మేనేజ్ చేస్తామంటే రూ. కోట్లు ఇచ్చేశారా ? నకిలీ సీబీఐ ఆఫీసర్ కేసులో విస్తుపోయే విషయాలు

నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనేక మందిని మోసం చేసినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.

FOLLOW US: 
Share:

Fake CBI Officer Case :  కొవ్విరెడ్డి శ్రీనినాస్ అనే నకిలీ ఐపీఎస్ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్ తాను సీబీఐ అధికారినంటూ  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో చాలా దందాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గ్రానైట్ అక్రమాల కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఆయన బంధువు, ఎంపీ అయిన మరో గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర పైనా ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను తాను మేనేజ్ చేస్తానని.. బయటపడేస్తానని కొవ్విరెడ్డి శ్రీనివాస్ మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు కూడా నకిలీ సీబీఐ ఆఫీస్‌ను నమ్మి.. డీల్ సెట్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. 

ముందస్తుగా వద్దిరాజు రవిచంద్ర కొవ్విరెడ్డి శ్రీనివాస్‌కు రూ. పాతిక లక్షల విలువైన బంగార ఆభరణాల్ని ఇచ్చారని చెబుతున్నారు. తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రూ. కోటి ఇతరుల నుంచి స్వీకరిస్తూండగా సీబీఐ అధికారులు దాడులు చేసి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో  కొవ్విరెడ్డి శ్రీనివాస్ దగ్గర ఫోన్, ల్యాప్ ట్యాప్ లను విశ్లేషిస్తే అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రలకు సంబందించి స్పష్టమైన సమాచారం ఉండటంతో వారిద్దరికి వెంటనే నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ పిలిపించి మరీ ప్రశ్నించారు. 

సీబీఐ అధికారి పేరుతో పలువుర్ని మోసం చేసినట్లుగా ఆధారాలు లభించడంతో  హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు పంపింది. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచు నాయుడుకి, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావుకి, సనత్‌నగర్‌కు చెందిన రవికి, మరొకరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నలుగురూ శుక్రవారమే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ స్పష్టం చేసింది.   సీబీఐ బ్రాంచ్‌ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని చెంచు నాయుడిని నమ్మించినట్లు తెలుస్తోంది.
వీరంతా శ్రీనివాస్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. బంగారు అభరణాలను సైతం ఇచ్చినట్లు తేలింది.  

వైజాగ్ లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్రీనివాస్.. అక్కడ వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సీబీఐ కనిపెట్టింది.  దేశ రాజధానిలో మకాం వేసి.. గత ఐదేళ్లుగా సీబీఐ అధికారినంటూ దందాలు, సెటిల్‌మెంట్‌ల పేరుతో అనేకమంది దగ్గర డబ్బులు దండుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని వారంతా.. విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే తాము చేసింది అక్రమం కనుక ఎక్కువ మంది  చెప్పుకోలేరని అంచనా వేస్తున్నారు. కానీ సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో  పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన వాళ్లు వణికిపోతున్నారు. 

Published at : 01 Dec 2022 04:18 PM (IST) Tags: Fake CBI officer Kovvireddy Srinivas collects money to manage cases Minister Gangula to probe CBI

సంబంధిత కథనాలు

BRS MLC IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో నాలుగో రోజూ సోదాలు -  ఐటీ గుప్పిటకు చిక్కినట్లేనా ?

BRS MLC IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో నాలుగో రోజూ సోదాలు - ఐటీ గుప్పిటకు చిక్కినట్లేనా ?

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు - గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు -  గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

టాప్ స్టోరీస్

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!