Etala Rajender : ఇక బీజేపీది ప్రభంజనమే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ !
రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభంజనేమే వస్తుందని.. తాను కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్ ఎంత గట్టిగా మాట్లాడతారో అంత పిరికివాడన్నారు
![Etala Rajender : ఇక బీజేపీది ప్రభంజనమే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ ! Etala Rajender warns that he will take revenge on KCR Etala Rajender : ఇక బీజేపీది ప్రభంజనమే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/99cc0fd05d644d25ef10d5648ac087af_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈటల రాజేందర్ మాటల దాడి పెంచుతున్నారు. నిన్నటికి నిన్న పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన తాజాగా కేసీఆర్‌పై పగ తీర్చుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు మొత్తం తెలిసిన వాడినని... ఆయన ఎంత గట్టిగా కొడితే అంత ఎక్కువగా పోరాడుతానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంత గట్టిగా మాట్లాడతాడో అంత పిరికివాడన్నారు. హుజురాబాద్‌లో గెలుపును పక్కదోవ పట్టించడం కోసం ఎన్నో ఎత్తుగడలు వేశారన్నారు. హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ను కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్ లో పడ్డాడని... భూమిమీదకు దిగివచ్చారన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని.. ప్రగతిభవన్ ఇనుపకంచెలు కూడా తొలగిపోవాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీది ప్రళయం ఉంటుంని దాన్ని కేసీఆర్ తట్టుకోలేరన్నారు.
రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని అలా కాకపోతే పేద కుటుంబం నుండి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే వారు కాదని గుర్తుు చేశారు. ప్రజలు న్యాయం ధర్మం పాటించకపోతే నేను మొన్న మళ్లీ ఎమ్మెల్యే అయ్యే వాడిని కాదని గుర్తు చేశారు. ఇక్కడ నియంతృత్వం, అహంకారం చెల్లదని... దేశ ప్రజలు ఎమర్జెన్సీ టైంలో వచ్చిన ఎన్నికల్లో చాటి చెప్పారన్నారు.
Also Read: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు
తాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా ధర్నా చేసిన వారికి మద్దతు తెలిపానని.. . సంఘాలు ఉంటాయి, సమస్యల కోసం కొట్లాడితాయి అని చెప్పిన వాడిని తానేనన్నారు. కెసిఆర్ కాళ్ళు మొక్కితే అన్నీ తప్పులు ఒప్పు అవుతాయని విమర్శించారు. ప్రస్తుతం ఇటు ఉన్న సూర్యుడు అటు పొడిసిన కూడా కెసిఆర్ గెలవడని ఈటల జోస్యం చెప్పారు. మొన్న వచ్చింది హుజూరాబాద్ తీర్పు కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షగా విశ్లేషించారు. మోదీ ప్రభుత్వం మీద ఒక్క మరక లేదు, ఒక్క స్కాం లేదు. ఆకలి తెలిసిన వారు ప్రధాని అయితే ఏం చేయోచ్చో చేసి చూపించిన వారు మోదీ అని ప్రశంసలు కురిపించారు.
వరిధాన్యం కొనలేక కెసిఆర్ కేంద్రం మీద నెపం వేశారుని.. రూ. 7200 కోట్లు రేషన్ బియ్యం కోసం కేంద్రం ఇస్తుందన్నారు. కేసీఆర్ అబద్ధాలు ప్రజలకు అర్థం అయ్యాయిని ఆయనను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజల కన్నీళ్లకు పరిష్కారం బీజేపీనేనని.. పవర్ కోసం కాదు, ప్రజలకోసం బీజేపి రావాలన్నారు. బీజేపీది ప్రళయం, ప్రభంజనం ఉంటుంది. దాన్ని కెసిఆర్ తట్టుకోలేరని స్పష్టం చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)