News
News
వీడియోలు ఆటలు
X

Telangana News : హైదరాబాద్‌లో టాక్స్ కట్టని లగ్జరీ కార్లు - చీకోటి ప్రవీణ్ సహా పలువురికి ఈడీ నోటీసులు !

టాక్స్ కట్టని లగ్జరీ కార్ల కేసులో చీకోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Telangana News :  తెలంగాణలో మరో లగ్జరీ కార్ల స్కాం  వెలుగు చూసింది.   హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది. టాక్స్ చెల్లించని వ్యాపారులపై విచారణ నిర్వహించారు. కోట్ల విలువైన కార్లను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. లగ్జరీ కార్లు కొని వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టారు. ఈ స్కాంలోనూ కేసినో కింగ్ గా ప్రసిద్ధి పొందిన  చికోటి ప్రవీణ్ ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. చీకోటి ప్రవీణ్ తో పాటు  నసీర్, మోసీన్‌ అనే వ్యక్తలకు ఈడీ నోటీసులు జారీ చేశారు.  ఈ నెల 15వ తారీఖున చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించునుంది.

గతంలోనూ ఇలాంటి స్కాం వెలుగు చూసింది.  విదేశీ రాయబారుల పేరుతో ఖరీదైన కార్లను దిగుమతి చేసుకొని పన్నులు ఎగ్గొడుతున్న వ్యవహారంపై ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ‘ఆపరేషన్ మాంటేకార్లో’ పేరుతో 2021లో దర్యాప్తు నిర్వహించారు.  హైదరాబాద్ నగరానికి చెందిన చాలా మంది ముంబై ముఠా నుంచి కార్లు కొనుగోలు చేశారు. ఇవన్నీ టాక్సులు కట్టకుండా దిగుమతి చేసినవే.  గడిచిన ఐదేళ్లలో ముంబై పోర్టుకు దిగుమతి అయిన 50 వరకూ కార్లలో చాలా మట్టుకు హైదరాబాద్ లో అమ్మారని డీఆర్ఐ అధికారులు కేసులు నమోదు చేశారు.                                                      

కనీసం రూ.కోటిపైనే ధర ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ తారలు కొనుగోలు చేస్తుంటారు.  విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా పన్నులు చెల్లించాల్సిఉంటుంది. విలువపై 204 శాతం దిగుమతి సుంకం కింద చెల్లించాలి.  అయితే దేశంలోని విదేశీ రాయబారులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు  ఈ వాహనాలకు  మారుమూల ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో దళారుల్లో రిజిస్ట్రేషన్ చేయింంచేవారు. ఆ స్కాంకు ప్రస్తుతం .. చీకోటి ప్రవీణ్ కు  నోటీసులు జారీ చేసిన స్కాంకు సబంధం ఉందేమో వెల్లడి కావాల్సి ఉంది.                                   

హైదరాబాద్‌లో లగ్జరీ కార్స్ కు.,. ముఖ్యంగా విదే శాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికి కొదువలేదు. అయితే అవన్నీ  టాక్సులు కట్టి దిగుమతి చేసుకున్నవేనా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అందుకే లగ్జరీ కార్ల జాబితాను.. దగ్గర పెట్టుకుని ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ కేసులోనూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. చీకోటి ప్రవీణ్ ఇప్పటికే కేసినో వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేయడంతో మొత్తం లెక్కలు బయటకు తెచ్చే అవకాశం ఉంది. 

Published at : 12 May 2023 02:41 PM (IST) Tags: Hyderabad News Chikoti Praveen ED Notices

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?