అన్వేషించండి

Delhi Liquor Scam Kavita Name : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ఈడీ వెలుగులోకి తెచ్చింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పాత్రను ప్రస్తావించారు.

Delhi Liquor Scam Kavita Name :  తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి సారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా..  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.
Delhi Liquor Scam Kavita Name :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా… దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.  అమిత్ అరోరా బడ్జీ అనే  ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు.  సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.  

ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడే తెలంగాణకు చెందిన కల్వకుంట్ల పేరును బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని.. తనపై విమర్శలు చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతుల సైలెంట్ అయ్యారు. ఇటీవల సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటును దాఖలు చేసింది. అలాగే.. ఈడీ కూడా సమీర్ మహేంద్రుపై చార్జిషీటు దాఖలు చేసింది. కానీ సెల్ ఫోన్ల ధ్వంసం గురించి ప్రస్తావించారు కానీ.. కవిత పేరు మాత్రం తెరపైకి తీసుకు రాలేదు. తొలి సారిగా ఈడీ ఈ కేసు విషయంలో కవిత పేరును ప్రస్తావించింది. 

సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో ప్రధానంగా అరబిందో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటికే అరబిందో డైరక్టర్ శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే శరత్ రెడ్డితో సమానంగా కవిత కూడా నేరానికి పాల్పడ్డారని ఈడీ చెప్పినా ఇప్పటి వరకూ కవితకు నోటీసులు కూడా జారీ చేయలేదు. ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget