News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tummala Vs KCR : తుమ్మలను లైట్ తీసుకున్న కేసీఆర్ - బుజగ్గించే ప్రయత్నమే చేయడం లేదా ?

తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదని కేసీఆర్ అనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు ?

FOLLOW US: 
Share:

Tummala Vs KCR :  ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన చేసినా బీఆర్ఎస్ హైకమండ్ పట్టించుకోవడం లేదు. వేములవాడ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించినా సలహాదారు పదవి ఇచ్చి సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఇతర అసంతృప్త నేతల్ని బుజ్జగిస్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్యా లేదన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో.. ఇక పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి తుమ్మల అనుచరులు వస్తున్నారు. 

తుమ్మలను కలుస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు

వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమంటున్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి విమర్శలు చేయడం లేదు. తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తుమ్మల తీసుకునే రాజకీయ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నారు.  పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారంతా కోరుతున్నారు.  అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా తుమ్మలను కలిశారు.  

తెలంగాణలో ఎన్నికల వలసలు - ఎవరెవరు ఏ పార్టీలోకి మారుతున్నారంటే ?

తుమ్మల వద్దకు కనీస రాయబారం పంపని బీఆర్ఎస్ హైకమాండ్                  

మ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న  ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్‌లో కొనసాగే ఆలోచనతో లేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్​భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది. భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలను..  అభ్యర్థులను కేసీఆర్ సమవేశానికి పిలిచారు కానీ.. తుమ్మలను పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. 

ఎటూ తేల్చుకోలేకపోతున్న షర్మిల - విలీనం ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్ లో చేరక తప్పదా ?                  

 తుమ్మల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్​ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.                     

Published at : 30 Aug 2023 03:53 PM (IST) Tags: Tummala Nageswara Rao BRS KCR Telangana Politics

ఇవి కూడా చూడండి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

టాప్ స్టోరీస్

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం