Dengue fever : ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
Telangana : తెలంగాణలో డెంగ్యూ ఫీవర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మామూలు జ్వరం అని భ్రమపడి చికిత్స కోసం ఆలస్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
Dengue fever cases are increasing in Telangana : తెలంగాణలో వర్షాలతో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆగస్టు నెలలో తొలి పద్దెనిమిది రోజుల్లోనే అధికారికంగా 1624 మందికి డెంగ్యూ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఇందులో సగం ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. తర్వాత వరంగల్‌లో డెంగ్యూ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొంత ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో టెస్టులు చేయించుకోవడం వల్ల ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.. డెంగ్యూ బారిన పడినా.. లోకల్ వైద్యం చేయించుకుంటూ ఎక్కువ సంఖ్యలో గ్రామీణులు ఉంటారని అంచనా వేస్తున్నారు.
డెంగ్యూ ఫీవర్‌ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు
డెంగ్యూ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైనది. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్ లెట్స్ పడిపోవడమే కాదు.. అంతర్గతంగా రక్త స్రావం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ ఫీవర్‌కు సరైన చికిత్స తీసుకోకపోతే.. అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు. డెంగ్యూ సోకినప్పుడు వచ్చే హై ఫీవర్ వల్ల చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడం సమస్యగా మారడం వంటి ఇబ్బందులు వస్తాయి. బాడీలో సోడియం , పొటాషియం వంటివి తగ్గిపోవడానికి కారణం అవుతాయి. ఇప్పటికే ఇతర సమస్యలు ఉంటే పెద్ద ఎత్తున డెంగ్యూ ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో సగం హైదరాబాద్‌లోనే !
తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 4100 కేసులు నమోదయ్యాయి. సగానికి పైగా హైదరాబాద్‌లోనే రికార్డవుతున్నాయి. ప్రతీ సారి వర్షాకాలం సమయంలోనే ఎక్కువగా ఈ కేసులు నమోదవుతాయి. అందుకే డెంగ్యూ సీజన్ గా కూడా చెబుతూంటారు. అదుకే.. జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి ..మామూలు జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య పరంగా అనే సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్ ఫ్రెండ్
ఇంట్లో దోమలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి !
డెంగ్యూ పూర్తిగా దోమ కాటు వల్లనే వస్తుంది. డెంగ్యూ కు కారణం అయ్యే దోమ.. మోకాళ్ల లోపు ఎత్తులో మాత్రమే ఉంటుంది. అంత కంటే కిందనే కుడుతుందని చెబుతున్నారు. అందుకే.. వర్షాకాలం ఇళ్లలో ఎక్కడా నీటి చెలమలు లేకుండా చూసుకోవాలి . అన్నీశుభ్రంగా ఉంచుకోవాలి. అంతే కాదు.. ఖచ్చితంగా దోమల నివారణకు.. ఏదో ఒకటి ఉపయోగించాలని సలహాలిస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. సాధారణంగా జ్వరం వస్తుంది పోతుంది.. కానీ డెంగ్యూ ఫీవర్ వస్తే.. చాలా తీసుకుపోతుంది.. డబ్బు, ఆరోగ్యం సహా అన్నీ. అందుకే ఈ జ్వరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు.