అన్వేషించండి

TS Debts : తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేంద్రం, ఎన్ని లక్షల కోట్లంటే?

TS Debts : తెలంగాణ అప్పుల చిట్టాను కేంద్రం ప్రకటించింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ రూ.4.33 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు లోక్ సభలో ప్రకటించింది.

TS Debts : తెలంగాణ అప్పుల లెక్కలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి  లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.  గత ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4,33,817.6 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పులు భారీగా పెరిగాయని  కేంద్రం సోమవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పుల మొత్తమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటికి రూ.75,577 కోట్ల అప్పులు ఉంటే, 2021-22 నాటికి అప్పులు కాస్త రూ.2,83,452 కోట్లకు చేరాయని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదిక ఇచ్చినట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రూ. 1.50 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకుల తెలిపాయి. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లు అని కేంద్రం లోక్ సభలో ప్రకటించింది.  

 తెలంగాణ అప్పులు 

తెలంగాణ అప్పులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. 2014-15లో రూ. 8,121 కోట్ల అప్పులు తీసుకోగా, 2015-16లో రూ. 15,515 కోట్లు, 2016-17లో రూ. 30,319 కోట్లు, 2017-18లో రూ. 22,658 కోట్లు, 2018-19లో రూ. 23,091 కోట్లు, 2019-20లో రూ. 30,577 కోట్లు, 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,50,365.6 కోట్ల అని కేంద్రం వెల్లడించింది. 

వివిధ పథకాల కింద 

తెలంగాణకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా, రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు అవ్వగా రూ. 852 కోట్లు ఇచ్చామని తెలిపింది. వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు తెలంగాణకు మంజూరు కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  

 ఏపీ అప్పులు

దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను ఇటీవల కేంద్రం ప్రకటించింది.  లోక్ సభలో కేంద్రం రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పై అప్పుల భారం పెరుగుతున్నట్లు కేంద్రం చెప్పింది. 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల తెలిపింది. ఏపీ జీడీపీలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు చెప్పింది. 2014లో ఏపీ జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. 2014 తర్వాత ఏపీ జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని, 2015లో 23.3 శాతం అప్పులు ఉండగా 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget