అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyberabad Police Update: సైబరాబాద్ పోలీస్ భలే కాంటెస్ట్.. ఎంపికైతే నగదు బహుమతులు, థీమ్ ఏంటంటే..

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు లఘు చిత్రాలను ఆహ్వానిస్తున్నట్లుగా సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఈసారి థీమ్ ‘‘మనం-రోడ్డు భద్రత’’. స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ ఈ పోటీలో భాగస్వామ్యం వహిస్తోంది.

సైబరాబాద్ పోలీసులు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌తో పాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. తాము నిర్వహించే 3వ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లకు లఘు చిత్రాలను ఆహ్వానిస్తున్నట్లుగా వారు ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ లఘు చిత్రాల థీమ్ ఏంటంటే.. ‘‘మనం-రోడ్డు భద్రత’’. స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ ఈ పోటీలో భాగస్వామిగా ఉంది. 

ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలో ఎంపికైన వారికి బహుమతులు కూడా ఇవ్వనున్నారు. తొలి మూడు ఉత్తమ లఘు చిత్రాలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. ఈ పోటీలో తొలి ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైతే రూ.50 వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు. రెండో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌కు రూ.30 వేలు, మూడో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌కు రూ.20 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ లఘు చిత్రాలను రూపొందించేందుకు లేదా పోటీలో పాల్గొనేవారికి నిర్వహకులు కొన్ని సూత్రాలు, మార్గదర్శకాలు నిర్దేశించారు.

Also Read: Nalgonda: పూడ్చిన శవాన్ని తవ్వి తీసి పడేశారు.. రోడ్డుపై శవపేటిక, నల్గొండలో అమానవీయ ఘటన

లఘు చిత్రం తీసేవారికి మార్గదర్శకాలు ఇవీ..
నిర్వహకులు నిర్దేశించిన థీమ్ ‘‘మనం-రోడ్డు భద్రత’’తో మాత్రమే షార్ట్ ఫిల్మ్‌లు తీయాలి. ఆ షార్ట్ ఫిల్మ్ నిడివి 60 నుంచి 120 సెకండ్లకు ( నిమిషం నుంచి రెండు నిమిషాల నిడివి) మించకూడదు. షార్ట్ ఫిల్మ్ ప్రారంభానికి ముందు లేదా తర్వాత వేసే క్రెడిట్ లైన్లు, టెక్నీషియన్ల పేర్లు వంటి వాటి నిడివి కలిపి ఆ సమయానికి మించకూడదు. షార్ట్ ఫిల్మ్‌లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లోనే ఉండాలి. ఏ భాషలో లఘు చిత్రం తీసినా దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాల్సి ఉంటుంది. 

లఘు చిత్రం తీశాక ఈ పోటీకి పంపాలంటే మొత్తం వీడియోను కంప్రెస్డ్ మోడ్‌లోనే పంపాలి. ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ బహుమతి కనుక గెలిస్తే దానికి సంబంధించిన ఒరిజినల్ క్వాలిటీ వీడియోను ఇవ్వాల్సి ఉంటుంది. అది కనీసం 1920x1080 రేషియోలో ఉండాలి. లఘుచిత్రాల పోటీలో ఎంట్రీలకు ఆఖరు తేదీ ఆగస్టు 31. 

ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొనాలనుకొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను కేశవ్ బండారి అనే వ్యక్తిని 9177283831 అనే నెంబరులో సంప్రదించవచ్చు. లేదా trfcord@scsc.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.

Also Read: Prakasam: కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. 20 లక్షలు ఇవ్వాలని భార్యకు ఫోన్‌...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Weather Update Today:బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
Embed widget