CV Anand Workout : స్పోర్ట్స్ స్టార్లు, హీరోలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చాలెంజ్ - వాళ్లు యాక్సెప్ట్ చేస్తార ?
సీవీ ఆనంద్ ఫిట్ నెస్ వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు తారలు, క్రీడాకారులకు ఆయన ఈ చాలెంజ్ విసిరారు.
CV Anand Workout : రైస్ బకెట్ చాలెంజ్ లు తరహాలో సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. ఈ మధ్య ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ప్రధాని మోదీ సహా అనేక మంది ఈ చాలెంజ్ లో పాల్గొని కసరత్తులు చేశారు. ఇప్పుడు అలాంటి చాలెంజ్ ఒకటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
Hi @VVSLaxman281 @pvsindhu1 @AdiviSesh @actor_Nikhil
— CV Anand IPS (@CVAnandIPS) June 24, 2023
Pl do share your workout videos as it’ll inspire everyone to do some physical activity. https://t.co/4GhSD3mvaT
జూన్ 23న ఒలింపిక్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. తాను వ్యాయామం చేస్తున్న దృశ్యాలతో నిమిషం నిడివి కలిగిన వీడియోను షేర్ చేశారు. నేడు మన జీవితాల్లోని ఆందోళనకరమైన ట్రెండ్‌ని ఒకసారి ఆలోచిద్దాం. మనుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ప్రపంచంలో.. ప్రజలు తక్కువగా కదులుతున్నట్లు చూడటం కలవరపెడుతుంది. చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్‌లు, డిజిటల్ గాడ్జెట్‌లకు అతుక్కుపోతున్నారు. శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీవీ ఆనంద్ అన్నారు.
శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ధోరణిని తిప్పికొట్టడానికి ఇది సమయం. చురుకైన జీవనశైలికి ప్రాధాన్యతనివ్వండి అని సీవీ ఆనంద్ సూచించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. దయచేసి మీ వ్యాయామ వీడియోలను పోస్టు చేయండి, వాటిని చూడటానికి ఇష్టపడతాను అని పేర్కొన్నారు. సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వర్కౌట్ వీడియోను షేర్ చేసి.. ఆ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, సినీహీరోలు అడవి శేషు, నిఖిల్‌లను ట్యాగ్ చేశారు. మీ వర్కౌంట్ వీడియోలను షేర్ చేయండి. ఎందుకంటే, అవి శారీరక శ్రమ చేయడానికి ప్రతిఒక్కరిని ప్రేరేపిస్తాయి అని సీవీ ఆనంద్ కోరారు.
సీవీ ఆనంద్ క్రీడాకారుడు కూడా. సీవీ ఆనంద్ 1986లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత అండర్ - 19 టీం జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన హైదరాబాద్ అండర్ - 19 & 22 జట్టులో ఆడాడు. సీవీ ఆనంద్ 45 కేటగిరి టెన్నిస్ లో అల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నాడు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ ను గెలిచాడు. అందుకే ఆయనకు ఫిట్ నెస్ ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఎంతో ఫిట్‌గా ఉండాలని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఫిట్ నెస్ వీడియో ద్వారా అందిరికీ తెలిసేలా చేశారు.