అన్వేషించండి

Medigadda Visit: మేడిగడ్డలో దెబ్బతిన్న పిల్లర్లను సీఎం రేవంత్ నేడు పరిశీలించనున్నారు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రాజెక్ట్ సందర్శిన

Revanth Sehedule: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ప్రాంతాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి బస్సులో ప్రాజెక్ట్ వద్దకు వెళ్లనున్నారు

Kaleswaram Project News: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేరుగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరనున్న ఎమ్మెల్యేల బృందం...మధ్యాహ్నం మూడున్నరకు  బ్యారేజీ వద్దకు చేరుకోనుంది.  బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తమయ్యారు

లోపాలు పరిశీలన
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోభాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల బృందం సందర్శించనుంది.  ఉదయం పదిన్నరకు  హైదరాబాద్(Hyderabad) నుంచి ప్రత్యేక బసుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు బయలుదేరనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Redy) కూడా బస్సులోనే వెళ్లనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మేడిగడ్డ బ్యారెజీ వద్దకు చేరుకోనున్న  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పిల్లర్లు, కుంగుబాటుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. వ్యూ పాయింట్ నుంచి నదిలోకి వెళ్లేందుకు అనువుగా  అధికారులు ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేశారు.  అనంతరం అక్కడే ప్రజల సమక్షంలోనే అధికారులు  బ్యారేజీ దెబ్బతినడానికి  కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth ReddY)కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించనున్నారు. సాయంత్రం ఆరుగంటల వరకు వారు మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ వద్దే ఉండనున్నారు. అనంతరం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  ఆ తర్వాత సీఎం సహా ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది.

కట్టుదిట్టమైన భద్రత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా  మేడిగడ్డ(Medigadda) సందర్శనకు రానుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతం చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో కల్వర్లులు, రహదారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తుండటంతో  పెద్దెఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను  మోహరించారు. స్పెషల్ పోలీసులు అటవీప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్నారు. 

కేసీఆర్ రావాలి
కాళేశ్వరం ఆర్కిటెక్ట్ కేసీఆర్(KCR) మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వచ్చి కుంగుబాటుకు కారణాలు తెలపాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంజినీర్లను పని చేయనీయకుండా  అన్నీ తాను చెప్పినట్లే చేయాలని కేసీఆర్ చెప్పడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఈదుస్థితి పట్టిందన్నారు.ప్రజల సొమ్ము దోచుకునేందుక ఇష్టానుసారం డిజైన్లు మార్చడమే గాక....ప్రాజెక్ట్ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని  విమర్శించారు. దీనిఫలితంగానే  ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ సందర్శనపై బీఆర్ఎస్(BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వం ప్రాజెక్ట్ లపై దండయాత్ర ప్రారంభించిందని మండిపడింది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దాల్సిందిపోయి..మొత్తం ప్రాజెక్ట్ నే నిలిపివేసే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget