అన్వేషించండి

CM Revanth Reddy : ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్ - పది రోజులు సీఎం రేవంత్ బిజీ టూర్స్ !

Telangana News : సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు తెలంగాణకు దూరంగా ఉండనున్నారు. ఢిల్లీ నంచి మణిపూర్ వెళ్లి ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.


CM Revanth Reddy  foreign visit :  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  పది రోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన  పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో  పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.  ఆ తర్వాత  ఆదివారం ఉదయం మణిపూర్‌ వెళ్ళి రాహుల్‌గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరవుతారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటిస్తారు.                                                                 

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది.   వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.                                             

తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ సదస్సుతో పాటు లండన్ పర్యనటలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తతదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీమ్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుంది.                  

ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు దాటింది. తీరిక లేని షెడ్యూల్ తో  బీజీగా ఉన్న  రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడుల సాధన విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదని అనుకున్నారు. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ప్రతీ సారి తెలంగాణ ప్రతినిధి బృందం  పాల్గొంటూ ఉంటుంది. ఈ సారి మిస్ కాకూడదన్న ఉద్దేశంతో వెళ్లాలనుకుంటున్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. ఆయన  పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.            

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget