అన్వేషించండి

Revanth Reddy : 22 కార్లు కొని విజయవాడలో దాచి పెట్టారు - కేసీఆర్‌పై రేవంత్ ఆరోపణలు

Prajapalana : ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటుందని అందరికీ మేలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆవిష్కరించారు.

Revanth Reddy on Prajapalana : ప్రజాపాలనలో భాగంగా గ్రా మ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆవిష్కరించారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

ప్రజల దగ్గరకే ప్రభుత్వం 

పదేళ్లు ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  దరఖాస్తుతో వివరాలు  అందుతాయని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతామనేగి తెలుస్తుందన్నారు. మంచి ఆలోచనతో చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్ కి ఎండీఓ.. మరో గ్రూప్ కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని క్లారిటీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. ఎవరి కోసం ఎదురు చూడంకండి ఎవరి దగ్గరకు పోవద్దని సూచించారు.  ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని అన్నారు. 

ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ 

 ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్ పై క్లారిటీ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చైర్మన్ ఉండాలని.. కానీ.. అందరూ రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రపతి అనుమతి గవర్నర్ కోరారని, వాటిని పరిశీలించి..చెప్తా అన్నారు. గందరగోళం కాకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు. నాలుగైదు రోజుల్లో గవర్నర్ నిర్ణయం ఇచ్చిన వెంటనే కమిటీ నియామకాలు జరుపుతామని అన్నారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. కేటీఆర్…ప్రజా వాణి  సమస్య పరిష్కారం కాలేదు అంటున్నాడని మండిపడ్డారు. లక్ష కోట్లలో లక్ష సాయం చేశారు కేటీఆర్ అన్నారు. ప్రజా వాని లక్ష్యం నెరవేరినట్టే అని.. కేటీఆర్ లక్ష కోట్లను..ప్రజలకు పంచిపిస్తాం.. లక్ష ఇచ్చాడు..ఇంకా మిగిలినవి ఇప్పిస్తామమన్నారు. 

ఖజానా అంతా ఊడ్చుకుపోయారన్న రేవంత్ 

అధికారం పోయినందున విత్ డ్రాయల్ సింప్టమ్‌తో  కేటీఆర్ బాధపడుతున్నారని రేవంత్ సెటైర్ వేశారు.  మంచంకి కట్టేసే వైద్యం చేయించాల్సి వస్తుందని వ్యంగాస్త్రం వేశారు. మెడిగడ్డలో ఎవరి పాత్ర ఎంత అనేది తేలుతుందన్నారు. ఖజానా అంతా ఊడ్చుకు పోయాడని మండిపడ్డారు. అందుకే శ్వేతపత్రం ఇచ్చామన్నారు. మేడిగడ్డ అన్నారం మీద విచారణ చేస్తున్నాం.. ముందుంది ముసళ్ళ పండగ.. అన్ని వసూలు చేస్తామన్నారు. అధికారిక సమాచారం వాళ్లకు ఇచ్చే వివరాలు కూడా ఉన్నాయన్నారు. మీదగ్గర ఉన్న వివరాలు కూడా ఇవ్వండి అని మీడియా మిత్రులకు రేవంత్ అన్నారు.   ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది.. చూస్తామన్నారు. కేంద్రం నుండి నిధులు ఆడిగామన్నారు.  సైనిక స్కూల్ వరంగల్ నుండి ఎందుకు పోయిందో చెప్పమని అడగండి అన్నారు. బుల్లెట్ ట్రైన్ గురించి అడిగే వినోద్ రావు.. సైనిక స్కూల్ ఎందుకు తరలిపోయింది ఎందుకో చెప్పు? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అన్నారు. 

22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారు !

మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడుకోవడానికి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ కార్లను విజయవాడలో దాచి  పెట్టారన్నారు. ఒక్కో కారు విలువ మూడు కోట్లు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయం తెలియడానికే తనకు చాలా సమయం పట్టిందన్నారు. ఇలా ఖజానాను ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Telugu Student Dies In US: అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Komaram Bheem Asifabad Tiger Attack News: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు-  కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Embed widget